Sakshi News home page

వరల్డ్స్ థినెస్ట్ ల్యాపీ ..రేటెంతో తెలుసా?

Published Wed, Jun 22 2016 10:55 AM

వరల్డ్స్ థినెస్ట్ ల్యాపీ ..రేటెంతో తెలుసా?

ప్రపంచంలోని  అత్యంత పలుచనైన ల్యాపీ భారత్ లోకి వచ్చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల సంస్థ హెచ్ పీ అత్యంత పలుచైన ల్యాప్ టాప్ ను భారత్ లో ఆవిష్కరించింది. ఈ ల్యాపీ మందం 10.4 ఎంఎం. స్పెక్ట్రమ్ 13 పేరుతో ప్రవేశపెట్టిన ఈ ల్యాపీ ప్రారంభ ధర రూ.1,19,990 గా కంపెనీ నిర్ణయించింది. శనివారం నుంచి అమ్మకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

12 అంగుళాల మ్యాక్ బుక్, 13 అంగుళాల మ్యాక్ ఎయిర్ కంటే ఇది చాలా పలుచైనదని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ల్యాపీని ఏప్రిల్ లోనే హెచ్ పీ ఆవిష్కరించింది.  కార్బన్ ఫైబర్, అల్యూమినియంతో రూపొందిన ఈ ల్యాపీ బరువు 1.11 కేజీ. మ్యాక్ బుక్ బరువు (0.92) కంటే కొంచెం ఎక్కువున్నా, మ్యాక్ బుక్ ఎయిర్ బరువు 1.35 కేజీ కంటే తక్కువేనని కంపెనీ చెప్పింది. ప్రీమియం రేంజ్ లో కొత్త లోగోతో స్పెక్ట్రమ్ 13 ల్యాపీని కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

స్పెక్ట్రమ్ 13 ల్యాపీ ఫీచర్లు...
13.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ డ్ల్యూఎల్ఈడీ-బాక్లిట్ ఐపీఎస్ డిస్ ప్లే
డ్యూయల్ స్పీకర్స్
4 సెల్ 38 డబ్ల్యూహెచ్ఆర్ లి-    అయాన్ బ్యాటరీ
ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 సీపీయూ
8 జీబీ ర్యామ్
512జీబీ ఎస్ఎస్ డీ స్టోరేజ్
మూడు యూఎస్ బీ టైప్-సీ పోర్ట్స్
 

Advertisement

What’s your opinion

Advertisement