ప్రవాస భారతీయులకు గుడ్‌ న్యూస్‌ | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయులకు గుడ్‌ న్యూస్‌

Published Tue, Jun 27 2017 7:22 PM

ప్రవాస భారతీయులకు గుడ్‌ న్యూస్‌ - Sakshi

న్యూఢిల్లీ:  విదేశాల్లోని భారత సంతతికి చెందిన వ్యక్తులు తమ గుర్తింపును ప్రవాస భారతీయ పౌరుడిగా మార్చుకునేందుకు  గడువును మరో ఆరు నెలలపాటు పొడిగించింది.  భారతీయ ప్రవాసులు ఓసీఐ కార్డు కోసం 31 డిసెంబరు వరకు  దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించింది.  2017 డిసెంబరు 31 వ తేదీ వరకు పిఐఓ కార్డుదారుల ద్వారా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పత్రం సమర్పించాల్సిన తేదీని విస్తరించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అధికారి ఒకరు తెలిపారు. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఐ) కార్డులను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ (ప్రవాస భారతీయ పౌరులు) కార్డులను డిసెంబరు 31 వరకు తీసుకోవాల్సి ఉంటుందని  కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 
 
2015 నుంచి పీఐఓ కార్డులను రద్దు చేస్తూ ఆ కార్డులను కలిగి ఉన్నవాళ్లు వాటిని ఓసీఐ కార్డులుగా మార్చుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పిడికి విధించిన గడువును జూన్ 30 వరకు పెంచుతూ మార్చి 31న ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ గడువును కూడా డిశంబర్ 31 వరకు  పొడిగించింది. 
 
కాగా జూన్ 30 లోపు గుర్తింపు కార్డుల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుందని  భావించడం లేదని ఇటీవల  భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఈ గడువును డిశంబర్ 31 వరకు పెంచాలని  యోచిస్తున్నట్టు తెలిపారు.  అలాగే  ఈ గడువులోపు తమ కార్డులను మార్చుకున్న వాళ్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి విదితమే. మరోవైపు ఈ మార్పును ప్రకటించినప్పటినుంచి గడువు పొడిగించడం ఇది నాలుగవ సారి. 
 

Advertisement
Advertisement