ట్రయంఫ్ బైక్‌లు వచ్చేశాయ్.. | Sakshi
Sakshi News home page

ట్రయంఫ్ బైక్‌లు వచ్చేశాయ్..

Published Fri, Nov 29 2013 12:14 AM

ట్రయంఫ్ బైక్‌లు వచ్చేశాయ్..

న్యూఢిల్లీ:  భారత లగ్జరీ బైక్ మార్కెట్లోకి మరో కొత్త కంపెనీ రంగప్రవేశం చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ 10 బైక్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు రూ. 5.7 లక్షలు-రూ.20 లక్షల రేంజ్‌లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. వచ్చే నెల చివరికల్లా  హైదరాబాద్, బెంగళూరుల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత ఢిల్లీ, ముంబైల్లో  డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని కంపెనీ డెరైక్టర్(సేల్స్ అండ్ మార్కెటింగ్-గ్లోబల్) పాల్ స్ట్రాడ్ చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని, జనవరిలో డెలివరీలు ఇస్తామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లి తెలిపారు.


 రుణాలు రెడీ: భారత్‌లో ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్ మంచి వృద్ధి సాధిస్తోందని పాల్ స్ట్రాడ్ చెప్పారు. తమ బైక్‌ల కొనుగోళ్ల కోసం రుణాలందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలి పారు. కంపెనీ విడుదల చేసిన పది మోడళ్లలో కొన్నిం టిని మానేసర్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తామని, మిగిలిన వాటిని పూర్తిగా తయారైన బైక్‌ల రూపంలో దిగుమతి చేసుకుంటామని చెప్పారు. వీటిలో  బొనెవిల్లె (రూ.5.7 లక్షలు,) తక్కువ ధర బైక్ కాగా. ఎక్కువ ధర ఉన్నది  రాకెట్ త్రి రోడ్‌స్టర్ బైక్ (రూ.20 లక్షలు). మానేసర్ ప్లాంట్‌లో బొనెవిల్లె టీ100, డైటోన 675ఆర్, స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్, థ్రక్స్‌టన్ బైక్‌లను  అసెంబుల్ చేస్తామని చెప్పారు. మిగిలిన బైక్‌లు-రాకెట్ త్రి రోడ్‌స్టర్, టైగర్ ఎక్స్‌ప్లోరర్, టైగర్ 800 ఎక్స్‌సీ, థండర్‌బర్డ్ స్టార్మ్‌లను దిగుమతి చేసుకుంటామని వివరించారు. మొదటి ఆర్నెల్లలో 400-500 బైక్‌లు విక్రయించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పాల్ పేర్కొన్నారు. భారత్‌లో ఏడాదికి 2,500 వరకూ ప్రీమియం బైక్‌లు అమ్ముడవుతాయని అంచనా.

Advertisement
Advertisement