ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి.. | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి..

Published Thu, Jun 2 2016 6:37 PM

ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి.. - Sakshi

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వాధికారులు ప్రైవేట్ ఈ-మెయిల్ అకౌంట్లు వాడకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మహారాష్ట్ర సచివాలయం 'మంత్రాలయ'లో కంప్యూటర్లకు ఇటీవల ఏర్పడిన లాకీ వైరస్ దెబ్బతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధికార పనులకు ప్రైవేట్ ఈ-మెయిల్ లను వాడొద్దని ఆదేశాలు జారీచేసింది. అధికార ఈ-మెయిల్ అకౌంట్లనే ఉద్యోగులు వాడాలని పేర్కొంది. మంత్రాలయాల్లో 150 కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. వాటిలో ఎక్కువగా రెవెన్యూ, పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ వే ఉన్నాయి. ఈ కంప్యూటర్లను ఫొరెన్సిక్ టెస్టు కోసం ల్యాబ్ కు పంపించారు.

ఈ సంఘటన తర్వాత ఇన్ ఫర్ మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు. ప్రభుత్వ డేటాలో ఎలా భద్రత పెంచాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రాలయ ఉద్యోగులందరూ కచ్చితంగా ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీలనే ప్రభుత్వ పనులకు వాడితే, ఈ వైరస్ బారినుంచి తప్పించుకోవచ్చని ఐటీ ప్రిన్సిపాల్ కార్యదర్శి వీకే గౌతమ్ సూచించారు. ఈ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 90శాతం ఉద్యోగులు జీమెయిల్, యాహు అకౌంట్లనే అధికార పనులకు వాడుతున్నారని అధికారులు చెప్పారు. అన్నీ ముఖ్యమైన అధికార పత్రాలను ఎనిమిది నుంచి తొమ్మిదో రోజుల్లో అధికార మెయిళ్లకు పంపించుకోవాలని గౌతమ్ ఉద్యోగులను ఆదేశించారు. 

Advertisement
Advertisement