Sakshi News home page

బీఎండబ్ల్యూ నుంచి కొత్త ‘6 సిరీస్ గ్రాన్ కూపే’

Published Sat, May 30 2015 1:21 AM

బీఎండబ్ల్యూ నుంచి కొత్త ‘6 సిరీస్ గ్రాన్ కూపే’

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన ‘6 సిరీస్ గ్రాన్ కూపే’లో మరో అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు ‘640డి ఎమినెన్స్’, ‘640డి డిజైన్’ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం) వరుసగా రూ.1.14 కోట్లు, రూ.1.21 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది 15 మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ తెలిపారు.     - న్యూఢిల్లీ

Advertisement

తప్పక చదవండి

Advertisement