రియల్టీకి ఊతం!

15 Sep, 2019 05:43 IST|Sakshi

రూ.10వేల కోట్లతో కేంద్ర నిధి

ఎన్‌సీఎల్‌టీ మెట్లెక్కని ప్రాజెక్టులకే..

ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు

సుంకాల ఉపశమనానికి 10వేలకోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్‌ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీన్లో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది.

ఈ 10వేల కోట్లను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి మధ్యలో ఆగిన ప్రాజెక్టుల పూర్తికి వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎన్‌పీఏలుగా ప్రకటించనివి, ఎన్‌సీఎల్‌టీ మెట్లు ఎక్కనివి అయి ఉండాలి. ‘ఈ ఫండ్‌ మార్కెట్, బ్యాంకింగ్‌ లేదా హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్ల వెతలు తీరుతాయి. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్‌ ప్రాజెక్టులు ఉపశమనం పొందుతాయి. మొత్తంగా 3.5 లక్షల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందే అవకాశముంది’ అని మీడియాతో చెప్పారు.

మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు..
► ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్‌ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఇండియా స్కీమ్‌ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.

► ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు.  

► నెలాఖరుకల్లా జీఎస్‌టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్‌ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో  ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఇది అమలులోకి వస్తుంది.  

► ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000– 68,000 కోట్లను విడుదల చేస్తారు.  
► అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు.

► వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్‌ ప్రత్యేక సమావేశంకానున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

10,400 అడుగుల ఎత్తులో ఎస్‌బీఐ శాఖ

కొత్త కార్లలో హ్యాండ్‌ బ్రేక్‌ లివర్‌ మాయం

‘మహీంద్ర మాటంటే మాటే..’

ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాక్‌ : అమ్మకాలు నిషేధించండి

యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

రూపే కార్డులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు తగ్గింపు

20న జీఎస్‌టీ మండలి సమావేశం

రిటర్నుల ఈ–అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

అంచనా కంటే భారత వృద్ధి మరింత బలహీనం

అదిరిపోయే ఫోటోలకు ‘రియల్‌మి ఎక్స్‌టీ'

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

మహీంద్రాలో 8 నుంచి 17 రోజులు ఉత్పత్తి నిలిపివేత

జొమాటో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్‌..

బ్రహ్మాండమైన అప్‌డేట్స్‌తో కొత్త ఐఫోన్‌, ట్రైలర్‌

అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు?!

అదరహో..అరకు కాఫీ

ఎగుమతులు రివర్స్‌గేర్‌

బీపీసీఎల్‌ మళ్లీ ‘విదేశీ’ పరం!

రేట్ల కోత లాభాలు

ఉక్కు ఉత్పత్తి నాణ్యత పెరగాలి: ధర్మేంద్ర ప్రధాన్‌

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నికర లాభం రూ. 96.71 కోట్లు

క్రికెట్‌ అభిమానులకు ‘జియో’ గుడ్‌ న్యూస్‌

భారతీయ భాషలతో మైక్రోసాఫ్ట్‌ ‘టీమ్స్’ 

ఎస్‌బీఐ కొత్త నిబంధనలు, అక్టోబరు 1 నుంచి

ఐసీఐసీఐకు సెబీ షాక్‌

మార్కెట్లోకి ‘ఆడి క్యూ7’

రిజిస్ట్రేషన్ల ఆధారంగా అమ్మకాల డేటా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

మాకు పది లక్షల విరాళం