ఇంటి అద్దెతో సొంతిల్లు! | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దెతో సొంతిల్లు!

Published Sat, Jan 28 2017 12:22 AM

ఇంటి అద్దెతో సొంతిల్లు!

రూ.14.90 లక్షలకే 2 బీహెచ్‌కే ఫ్లాట్‌
సైనిక్‌పురిలో 5.50 ఎకరాల్లో సితార ప్రాజెక్ట్‌కు శ్రీకారం
10 అంతస్తుల్లో 1,078 ఫ్లాట్ల నిర్మాణం
5 నెలల్లో మియాపూర్‌లో 2,000; నాచారంలో 1,000 ఫ్లాట్లు కూడా..
‘సాక్షి రియల్టీ’తో జనప్రియ చైర్మన్‌ కే రవీందర్‌ రెడ్డి


జనప్రియ.. భాగ్యనగరవాసులకు పరిచయం అక్కర్లేని నిర్మాణ సంస్థ. నిజం చెప్పాలంటే అపార్ట్‌మెంట్‌ సంస్కృతిని పరిచయం చేసింది ఈ సంస్థే. ఇప్పుడదే నిర్మాణ సంస్థ బృహత్తర ప్రాజెక్ట్‌తో మరోసారి నగరవాసుల ముందుకొచ్చింది. ఈసారి ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకాన్ని ఆసరా చేసుకొని సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిద్ధమైంది.
– సాక్షి, హైదరాబాద్‌

‘‘హైదరాబాద్‌లో ఎక్కడైనా సరే 2 బీహెచ్‌కే అద్దె రూ.5–7 వేలుంటుంది. దీనికి అదనంగా రూ.2–4 వేలు చెల్లించే స్తోమత మీకుందా? అయితే మీరిక అద్దె ఇంట్లో ఉండక్కర్లేదు. ఎంచక్కా సొంతింట్లో హాయిగా ఉండొచ్చు! దీన్ని నిజం చేసేందుకే ‘సితార’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని’’ జనప్రియ చైర్మన్‌ కె. రవీందర్‌ రెడ్డి చెప్పారు. ప్రాజెక్ట్‌ విశేషాలను ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

జనప్రియ మొదటి నుంచి కూడా సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగానే ఇళ్లను నిర్మిస్తోంది. తాజాగా సితార ప్రాజెక్ట్‌లో మొత్తం 1,078 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం. రూ.20–50 వేల లోపు వేతనంతో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు సితారలో ఫ్లాట్‌ పొందేందుకు సువర్ణావకాశం.

సైనిక్‌పురిలో 5.50 ఎకరాల్లో సితార ప్రాజెక్ట్‌ రానుంది. 4 భవనాల్లో 10 అంతస్తుల్లో కలిపి మొత్తం 1,078 రెండు పడక గదులుంటాయి. 580 నుంచి 865 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర రూ.14.90 లక్షలు. ప్రాజెక్ట్‌లో 70 శాతం ఓపెన్‌ స్పేసే. సితార ప్రాజెక్ట్‌ సైనిక్‌పురి మెయిన్‌ రోడ్‌ నుంచి 1.5 కి.మీ., ఈసీఐఎల్‌ నుంచి 3 కి.మీ., తిరుమలగిరి క్రాస్‌ రోడ్‌ నుంచి 6 కి.మీ., తార్నాక నుంచి 9 కి.మీ. దూరంలో ఉంది.

నెలకు రూ.9,515 ఈఎంఐ..
రూ.14.90 లక్షల్లో.. పీఎంఏవై పథకం కింద రూ.2.20 లక్షలు సబ్సిడీ, కస్టమర్‌ ముందస్తుగా చెల్లించే రూ.1.70 లక్షలు పోను.. మిగిలిన రూ.11 లక్షలకు ఈఎంఐ చెల్లించాలి. అంటే గృహ రుణ వ్యవధి 20 ఏళ్లు, 8.6 శాతం వడ్డీ రేటు అయితే నెలకు రూ.865గీ11= 9,515. అంటే ఇంటి అద్దెతో సొంతిల్లు సొంతమన్నమాటేగా!!
êవచ్చే 5 నెలల్లో మియాపూర్‌లో 2,000 ఫ్లాట్లు, నాచారంలో 1,000 ఫ్లాట్లు కూడా నిర్మించాలని నిర్ణయించాం. మొత్తంగా ఈ ఏడాది ముగింపు నాటికి 4,100 రెండు పడక గదుల నిర్మాణాలు చేయాలనేది లక్ష్యం.

వసతులూ ఎక్కువే..
వసతుల విషయానికొస్తే.. క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్, జిమ్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, ఇండోర్‌ అండ్‌ ఔట్‌ డోర్‌ గేమ్స్, కమ్యూనిటీ బాంక్వెట్‌ హాల్‌ వంటి అన్ని రకాల సదుపాయాలుంటాయి. రెండు లెవల్స్‌ పార్కింగ్, 24 గంటల సెక్యూరిటీ, ఏటీఎం, క్రచ్, ఇంటర్‌నెట్‌ సదుపాయం వంటివి కూడా ఉంటాయి.

హాల్, బెడ్‌ రూమ్స్, కిచెన్, టాయిలెట్స్‌లో సెరామిక్‌ టైల్స్, బాల్కనీ, యుటిలిటీ ఏరియాలో సిరామిక్‌ టైల్స్‌ విత్‌ పీవీసీ, కిచెన్‌ ప్లాట్‌ఫాం 30 ఎంఎం థిక్‌ కడప స్టోన్‌ను ఇస్తున్నాం. ప్లంబింగ్‌లో సీపీవీసీ పైపులు, శానిటేషన్‌లో సెరా, ప్లాస్ట్రోకాఫ్ట్‌ వంటి అన్ని ఉత్పత్తులూ బ్రాండెడ్‌వే వినియోగిస్తున్నాం.

కార్పెట్‌ ఏరియా 3 శాతం అదనం..
జర్మన్‌ ఫ్రేం వర్క్, ప్రీ–కాస్ట్‌ టెక్నాలజీతో ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నాం. దీంతో ఇతర 2 బీహెచ్‌కే ఫ్లాట్లతో పోల్చుకుంటే ఇందులో 3 శాతం కార్పెట్‌ ఏరియా ఎక్కువొస్తుంది. అదెలాగంటే.. సాధారణ 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో వెలుపలి గోడలు 9 ఇంచులు, లోపలి గోడలు 6 ఇంచులు, పిల్లర్, బీమ్‌లు కలిపి మొత్తం స్థలంలో 12 శాతం స్థలాన్ని ఆక్రమిస్తాయి. అదే సితార ఫ్లాట్‌లో 6 ఇంచుల వెలుపలి గోడలు, 4 ఇంచుల లోపలి గోడలతో 9 శాతం స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తాయి. పిల్లర్‌ గానీ, బీమ్‌లు గానీ ఉండవిందులో. మరి పిల్లర్‌ లేకుండా ఎలా నిర్మిస్తారనేగా మీ సందేహం? ప్రాజెక్ట్‌ స్ట్రక్చర్‌ మొత్తం రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ గోడతో నిర్మిస్తారు. అంటే ప్రతి గోడ పిల్లర్‌ కంటే శక్తివంతంగా ఉంటుంది. దీంతో బీమ్, పిల్లర్‌ అవసరం ఉండదు. దీంతో కార్పెట్‌ ఏరియా 3 శాతం అదనంగా వస్తుంది.

నిర్మాణంలో మరో 4 ప్రాజెక్ట్‌లు..
ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో 4 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి క్లాసిక్‌ హోమ్స్, సిల్వర్‌క్రెస్ట్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం. ఆ ప్రాజెక్ట్‌ల వివరాలివే..
మోతీనగర్‌లో 4 ఎకరాల్లో క్లాసిక్‌ హోమ్స్‌ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇందులో మొత్తం 375 ఫ్లాట్లుం టాయి. ఇప్పటికే 75 ఫ్లాట్లు కొనుగోలుదారులకు అందించాం కూడా. ధర రూ.45–70 లక్షలున్నాయి. 1,125–1,840 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. స్ట్రక్చర్‌ పూర్తయింది. ఫినిషింగ్‌ స్టేజ్‌లో ఉంది.
చందానగర్‌లో 24 ఎకరాల్లో నైల్‌వ్యాలీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 2,400 ఫ్లాట్లు. ఇందులో 800 ఫ్లాట్లు పూర్తి చేసి.. కస్టమర్లకు అందించాం. మిగిలిన 1,600 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ధర రూ.25– 50 లక్షలున్నాయి. 940–1,100 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,100–1,550 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి.
అల్వాల్‌లోని కౌకూర్‌లో 12 ఎకరాల్లో ఆర్కేడియా నిర్మాణంలో ఉంది. మొత్తం 950 ఫ్లాట్లు. ఇప్పటికే 650 ఫ్లాట్లలో కుటుంబాలు నివసిస్తున్నాయి. 300 ఫ్లాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ధర రూ.22–30 లక్షలుగా ఉన్నాయి. 925–1,250 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి.
సైనిక్‌పురిలో 12 ఎకరాల్లో సిల్వర్‌క్రెస్ట్‌ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 200 విల్లాలు. ధర రూ.40–60 లక్షలు. రో హౌస్‌ విల్లాల విస్తీర్ణాలు 110 గజాల్లో 1,450 చ.అ.బిల్టప్‌ ఏరియాలో, ఇండిపెండెంట్‌ విల్లాలు 175 గజాల్లో 1,800 చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఉంటాయి.

Advertisement
Advertisement