Sakshi News home page

దేశీ విమానయాన సంస్థల సేఫ్టీ ఆడిట్‌ షురూ..

Published Fri, Sep 28 2018 1:34 AM

Safety Audit resumes domestic airlines - Sakshi

న్యూఢిల్లీ: దేశీ విమానప్రయాణాల్లో ఇటీవల పలు వివాదాస్పద ఉదంతాలు నమోదవుతున్న నేపథ్యంలో విమానాల్లో రక్షణ చర్యలపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక సేఫ్టీ ఆడిట్‌ ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే షెడ్యూల్డ్‌ విమానయాన సంస్థలన్నింటిపైనా ఆడిట్‌ జరుగుతోందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్‌ 15 నుంచి ముంబై కేంద్రంగా పనిచేసే ఎయిర్‌లైన్స్‌ ఆడిట్‌ చేపట్టనున్నట్లు వివరించారు.

విమానయాన సంస్థల కార్యకలాపాలతో పాటు శిక్షణా కార్యక్రమాలు.. కేంద్రాలు, సిబ్బంది పనితీరును కూడా మదింపు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది షెడ్యూల్డ్‌ ఆపరేటర్స్‌ ఉండగా .. ఎయిరిండియా, జెట్‌ ఎయిర్‌వేస్, గోఎయిర్, విస్తార మొదలైనవి ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ప్రయాణం మధ్యలో ఇంజిన్లు ఫెయిల్‌ కావడం, విమానాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరులతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ ఆడిట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.   

Advertisement

What’s your opinion

Advertisement