ఎస్‌బీహెచ్ 110 వారాల డిపాజిట్ స్కీమ్ | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ 110 వారాల డిపాజిట్ స్కీమ్

Published Tue, Mar 11 2014 1:04 AM

ఎస్‌బీహెచ్ 110 వారాల డిపాజిట్ స్కీమ్ - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) అధిక వడ్డీ, లిక్విడిటీతో కూడిన కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 110 వారాల కాలపరిమితి ఉండే ఈ డిపాజిట్‌పై 9.11 శాతం వడ్డీని, అదే సీనియర్ సిటిజన్స్ అయితే 9.41 శాతం వడ్డీని ఎస్‌బీహెచ్ ఆఫర్ చేస్తోంది. డిపాజిట్ చేసిన ఏడు రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందుగానే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీ లేకపోవడం ఈ డిపాజిట్ పథకంలోని ప్రధాన ఆకర్షణ.
 
 మార్చి 10 నుంచి ప్రారంభమైన ఈ డిపాజిట్ పథకం ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని ఎస్‌బీహెచ్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.99 లక్షలు వరకూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.

Advertisement
Advertisement