Sakshi News home page

ఫ్లాట్‌ ఓపెనింగ్‌.. పుంజుకున్న మార్కెట్లు

Published Fri, Jul 20 2018 10:32 AM

Sensex Extends Gains Post Flat Opening, Nifty Eyes 11K - Sakshi

ముంబై : ఫ్లాట్‌గా ప్రారంభమైన శుక్రవారం నాటి స్టాక్‌ మార్కెట్లు, ఆ తర్వాత పుంజుకున్నాయి. మిడ్‌క్యాప్స్‌ రికవరీ అవడంతో పాటు, ఐటీ షేర్లు ఎక్కువగా లాభపడుతుండటంతో మార్కెట్లు పైకి జంప్‌ చేస్తున్నాయి. సెన్సెక్స్‌ ప్రస్తుతం 100 పాయింట్లకు పైగా ఎగిసింది. 168 పాయింట్ల లాభంలో 36,519 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం సాంకేతికంగా తన కీలకమైన మార్కు 11వేల బీట్‌ చేసి 50 పాయింట్ల లాభంలో 11,006 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం సరికొత్త కనిష్టాన్ని తాకింది. ఐటీ స్టాక్స్‌ భారీ ఎత్తున్న పెరుగుతుండటంతో, రూపాయి సరికొత్త కనిష్టంలో 69.12 స్థాయిని తాకింది. ఐటీ ఇండెక్స్‌ 1 శాతానికి పైగా ఎగిసింది.

మెటల్స్‌, పీఎస్‌యూ బ్యాంకులు మాత్రమే బలహీనంగా ట్రేడవుతున్నాయి. మెటల్స్‌లో వేదంత ఎక్కువగా 2 శాతం మేర పడిపోయింది. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. 2018 ప్రారంభం నుంచి ఈ స్టాక్‌ ఇండెక్స్‌లో 23 శాతం మేర పెరిగింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో రిలయన్స్‌తో పాటు ఇన్ఫోసిస్‌, హిందాల్కో టాప్‌ గెయినర్లుగా ఉండగా.. వేదంత, ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ టాప్‌ లూజర్లుగా నష్టాలు గడించాయి. కాగ, నేడు పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు సభ ప్రారంభమైన తర్వాత ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.   
 

Advertisement

What’s your opinion

Advertisement