Sakshi News home page

స్టాక్‌మార్కెట్ల జోరు : 7వ రోజు లాభాలు

Published Wed, Dec 19 2018 2:45 PM

Sensex Extends Rally To Seventh Straight Session, Nifty Above 10950 - Sakshi

సాక్షి,ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు క్రూడ్‌ ఆయిల్‌ పతనంతో ఆరంభంలో లాభాలతో ప్రారంభమైనాయి వరుసగా ఏడవ సెషన్‌లో కూడా ఉత్సాహంగా ఉన్న సెన్సెక్స్‌  ప్రస్తుతం 164 పాయింట్లు  ఎగిసి 36,511 వద్ద,  నిఫ్టీ  62 పాయింట్ల లాభంతో 10,971 వద్ద కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌ 36500 స్థాయికి, నిఫ్టీ 10950కి ఎగువన   ట్రేడ్‌ అవుతుండటం విశేషం.

ఐటీ(0.8 శాతం) మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే  ఉన్నాయి.  పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం చొప్పున బలపడగా.. ఫార్మా, రియల్టీ, ఆటో 0.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి.  ఐబీ హౌసింగ్‌ 5 శాతం జంప్‌చేయగా.. ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, యాక్సిస్‌, ఐవోసీ  టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు రూపాయి బలంతో ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్తోపాటు టాటా మోటార్స్‌, వేదాంతా,  జీ, సన్‌ ఫార్మా  నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అటు డాలరు మారకంలో  రుపీ స్థిరంగా కొనసాగుతోంది. 17పైసలు లాభంతో 70. 25 వద్ద ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement