లాభాల నుంచి నష్టాల్లోకి... | Sakshi
Sakshi News home page

లాభాల నుంచి నష్టాల్లోకి...

Published Tue, Aug 8 2017 9:50 AM

Sensex rebounds in opening but again turns to redish

ముంబై : లాభాలతో ప్రారంభమైన మంగళవారం స్టాక్‌ మార్కెట్లు, ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 24.35 పాయింట్ల నష్టంలో 10,033 వద్ద ట్రేడవుతుండగా.... సెన్సెక్స్‌ 91.38 పాయింట్ల నష్టంలో 32,182 గా కొనసాగుతోంది. టాటా స్టీల్‌ లాభాలు నాలుగింతలు పెరగడంతో, ఆ కంపెనీ స్టాక్స్‌ నేటి మార్కెట్‌లో లాభాల పంట పండిస్తున్నాయి. 2 శాతం మేర పైకి జంప్‌ చేశాయి.
 
అధికారికంగా భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో వాటాను భారతీ ఎయిర్‌టెల్‌ అమ్మేయడంతో​,  ఎయిర్‌టెల్‌ 1 శాతం మేర లాభపడుతుండగా.. ఇన్‌ఫ్రాటెల్‌ 3 శాతం మేర నష్టపోతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో, సన్‌ ఫార్మా లాభాల్లో సాగగా.. ఐఓసీ, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఒత్తిడిలో కొనసాగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు నష్టపోతూ 63.74 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 55 రూపాయల లాభంలో 28,461 రూపాయలుగా ఉన్నాయి. 

Advertisement
Advertisement