లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

Published Wed, Jul 13 2016 9:56 AM

Sensex rises 120 points to 27,928 in early trade

ముంబయి: స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు కూడా లాభాలతో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్  120 పాయింట్ల లాభంతో 27,928.76 పాయింట్లతో, ఇక  నిఫ్టీ 8,520.60 పాయింట్లతో ట్రేడ్ అవుతున్నాయి.

ఇక సెక్టార్‌ సూచీల్లో  టెక్ సూచీలు 0.58శాతం, రియాల్టీ 0.63శాతం , పవర్‌ సూచీలు 0.71శాతం, ఆటో సూచీలు 1.09శాతం నష్టపోతున్నాయి. నిఫ్టీ టాప్‌ గేయినర్స్  లో  అరబిందో ఫార్మా 1.87శాతం, కోల్ ఇండియా  1.53శాతం, యస్‌ బ్యాంక్‌  1.20శాతం లాభపడుతున్నాయి.  నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో గేయిల్‌ 2.65శాతం,  పవర్‌ గ్రిడ్‌ 2.63శాతం, ఎన్‌టిపిసి 2.21శాతం నష్టపోతున్నాయి. మరోవైపు రూపాయి కూడా బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి ఏడు పైసలు లాభపడింది.
 

Advertisement
Advertisement