ఈ నెల 11 నుంచి టాటా నెక్సాన్‌ బుకింగ్స్‌ | Sakshi
Sakshi News home page

ఈ నెల 11 నుంచి టాటా నెక్సాన్‌ బుకింగ్స్‌

Published Thu, Sep 7 2017 12:12 AM

ఈ నెల 11 నుంచి  టాటా నెక్సాన్‌ బుకింగ్స్‌

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం ‘టాటా మోటార్స్‌’ త్వరలో మార్కెట్లో ప్రవేశపెడుతున్న కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘నెక్సాన్‌’ బుకింగ్స్‌ను సెప్టెంబర్‌ 11 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్స్‌ వద్ద రూ.11,000లతో నెక్సాన్‌ మోడల్‌ను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. నెక్సాన్‌ మోడల్‌తో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఎస్‌యూవీ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తామని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్‌ బిజినెస్‌ విభాగం) మాయంక్‌ పరీఖ్‌ ధీమా వ్యక్తంచేశారు. 1.2 లీటర్‌ పెట్రోల్, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో మార్కెట్‌లోకి వస్తోన్న నెక్సాన్‌... మారుతీ వితారా బ్రెజా, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్, హోండా డబ్ల్యూఆర్‌–వీ, హ్యుందాయ్‌ క్రెటాలకు గట్టిపోటీనిస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement
Advertisement