Sakshi News home page

హైదరాబాద్‌లో తోషిబా 185 కోట్ల పెట్టుబడులు

Published Tue, Nov 11 2014 12:51 AM

హైదరాబాద్‌లో తోషిబా 185 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తోషిబా కార్పొరేషన్ రూ. 185 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ యూని ట్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా(టీటీడీఐ) సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని, ఇందుకోసం రూ. 185 కోట్లు (30 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ ఎలక్ట్రికల్స్‌ను గతేడాది రూ. 1,230 కోట్లకు తోషిబా కార్పొరేషన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
 
రెండేళ్లలో రూ.615 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్...
 దేశీయ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో 2016లోగా రూ.615 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయంలో భాగంగా ఈ పెట్టుబడులను చేస్తున్నట్లు టీటీడీఐ కత్సుతోషి తొదా ఆ ప్రకటనలో తెలిపారు. దేశీయ విద్యుత్ రంగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించామని, ఈ పెట్టుబడులతో పెద్ద ట్రాన్స్‌ఫార్మర్స్‌తోపాటు కొత్త తరహా స్విచ్‌గేర్స్‌ను తయారు చేయనున్నట్లు తెలిపారు.

500 ఎంవీఏ సామర్థ్యం గల ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ 765కేవీ విద్యుత్ ఉత్పత్తిని తట్టుకుంటాయన్నారు. కొత్తగా తయారు చేసే స్విచ్‌గేర్స్ హైవోల్టేజ్ ప్రోడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తాయన్నారు. దేశీయ విద్యుత్ సరఫరా, పంపిణీ మార్కెట్లో 2016 నాటికి 20 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుత్సతోషి తెలిపారు.

 2017 నాటికి ప్రస్తుత విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఐదు రెట్లు పెంచే విధంగా 765కేవీ ట్రాన్స్‌ఫార్మర్స్ ఏర్పాటును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భారీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్స్, స్విచ్‌గేర్స్‌కు డిమాండ్ బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూరప్, ఏషియన్, ఆఫ్రికా దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు చేసే విధంగా బారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్లు కుత్సతోషి తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement