నోట్ల రద్దుతోరుణ డిమాండ్‌ డౌన్‌ | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతోరుణ డిమాండ్‌ డౌన్‌

Published Thu, Jan 12 2017 12:12 AM

నోట్ల రద్దుతోరుణ డిమాండ్‌ డౌన్‌

ద్విచక్ర, కన్సూమర్‌ రుణాలపై ప్రభావం: సిబిల్‌
ముంబై: ద్విచక్ర, వినియోగ వస్తు(టూవీలర్, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌) రుణాలపై డీమోనిటైజేషన్‌(నోట్ల రద్దు) ప్రభావం తీవ్రంగా పడిందని క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ కంపెనీ ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ పేర్కొంది. ‘టూవీలర్, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ రుణాల్లో సాధ్యమైనంత వరకు ప్రైవేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వాటానే ఎక్కువ. వీటిపై నోట్ల రద్దు చాలా ప్రతికూల ప్రభావం చూపింది’ అని సిబిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమృత మిత్ర తెలిపారు. ప్రాంతాలల్లో వారీగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. క్రెడిట్‌ కార్డులు, ఇతర వాహన రుణాలు సహా పలు కన్సూమర్‌ డ్యూరబుల్‌ ప్రొడక్టుల డిమాండ్‌ కూడా నవంబర్‌ 8 తర్వాత పడిపోయిందని చెప్పారు.

2015 జనవరి–సెప్టెంబర్‌ మధ్యకాలంతో పోలిస్తే 2016 ఇదే సమయంలో వినియోగ వస్తు రుణాల డిమాండ్‌ 35 శాతంమేర ఎగసిందని అమృత మిత్ర తెలిపారు. అయితే నవంబర్, డిసెంబర్‌ నెలల్లో మాత్రం పలు విభాగాల్లోని పరిస్థితులు తారుమారు అయ్యాయని, డిమాండ్‌ తగ్గిందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహన రుణ దరఖాస్తులు ఆశించిన (14 లక్షలు) స్థాయి కన్నా 43 శాతంమేర తక్కువగా వచ్చాయని తెలిపారు. వినియోగ వస్తు విభాగపు రుణ దరఖాస్తుల్లో 60 శాతం క్షీణత నమోదయ్యిందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement