Sakshi News home page

50 ఏళ్లు పైబడితే.. ఆరోగ్య బీమాలో ఏది బెస్ట్?

Published Mon, Jun 22 2015 12:34 AM

What is the best health insurance coverage for more than 50 years ..?

ఫీడర్ ఫండ్స్ గురించి తెలియజేయండి?

 - భావనారాయణ, ఏలూరు
 తన లక్ష్యాలకు అనుగుణంగా మరో ఫండ్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేయించే ఫండ్‌నే... ఫీడర్ ఫండ్ అంటారు. ఈ తరహా ఫండ్స్‌కు దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే వీలుంటుంది. అయితే ఇలాంటి ఫీడర్ ఫండ్‌లో పెట్టుబడులను ఫారిన్ అసెట్‌గా పరిగణించరు. మీ దేశీయ ఇన్వెస్ట్‌మెంట్ పోర్టిఫోలియలో ఈ ఫండ్స్ భాగమైనందున, ఇలాంటి ఫండ్‌లో పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని మీరు ప్రత్యేకంగా ఆర్‌బీఐకో లేక ఆదాయపు పన్ను శాఖకో మరేదైనా ప్రభుత్వ సంస్థకో తెలియజేయాల్సిన అవసరం లేదు. దేశీయ ఈక్విటీలోకి 65 శాతంకన్నా తక్కువ ఇన్వెస్ట్‌చేసే ఫీడర్ ఫండ్ విషయంలో... అది నాన్ ఈక్విటీ ఫండ్ అయితే పన్నులు వర్తిస్తాయి.

ఫారిన్ ఈక్విటీలో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో, నాన్-ఈక్విటీ ట్యాక్స్ వర్తిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (36 నెలలకన్నా ఎక్కువ కాలం యూనిట్స్ ఉంచుకునే విషయంలో) విషయంలో 20 శాతం పన్ను విధించడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (36 నెలల కన్నా తక్కువ యూనిట్లను ఉంచుకునే సందర్భంలో) విషయంలో స్లాబ్ రేటు ప్రకారం పన్ను నిబంధనలు వర్తిస్తాయి.

 ‘ప్రత్యక్ష’ విధానం ద్వారా నేడు ఫండ్‌ను ఎక్కడ/ఎలా కొనాలి. నా డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) ద్వారా నేను ఫండ్స్‌ను కొనుగోలు చేయగలనా?
- రుక్మిణి, విజయవాడ
 మీరు ఏవైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రత్యక్ష ప్రణాళిక ద్వారా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే, ఏఎంసీ(సంబంధిత సంస్థ- అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)ని ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. నిజానికి ఒక ఏఎంసీ తన ఏజెంట్లకు వారి సేవలకు గాను కొంత కమీషన్ చెల్లిస్తుంది. అయితే మీరు ప్రత్యక్షంగా ఇన్వెస్ట్ చేయదలచుకుంటే... ఈ కమీషన్ల భారం నుంచి మీకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతియేడాదీ మీకు మరింత మంచి రిటర్న్స్ అందుతాయి. మీరు డెరైక్ట్ ప్లాన్‌తో ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతారంటే...

► ఫండ్ హౌస్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లినప్పుడు వారు ఒక దరఖాస్తు ఇస్తారు. ఈ అప్లికేషన్ ఫారమ్‌లో డిస్ట్రిబ్యూషన్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉన్న చోటు ‘డెరైక్ట్’ అని వ్రాయాలి.
► సీఏఎంఎస్ తరహాలోనే మీ దరఖాస్తును ఫండ్ హౌసెస్ రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయాలి. ఫండ్ హౌస్ సొంత పోర్టల్‌లో రిజిస్టర్ కావాలి. తద్వారా మీ పెట్టుబడి పెట్టాలి.

 నా షేర్లు అన్నీ డీమ్యాట్ రూపంలో ఉన్నాయి. సీడీఎస్‌ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్) రిజిస్ట్రేషన్, దాని సేవల ద్వారా నా పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షిస్తుంటాను. నా పోర్ట్‌ఫోలియోను అందుబాటులో ఉంచుకోవడం కోసం సీడీఎస్‌ఎల్‌పై రిజిస్ట్రేషన్ సరిపోతుందా..? లేదా మరింత వెసులుబాటుగా సీఏఎంఎస్(కంప్యూటర్ యేజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్)పై కూడా రిజిస్టర్ కావాలా..? ఇలా రెండింటిపై రిజిస్టేషన్ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా?
 - రాజేంద్రప్రసాద్, హైదరాబాద్

 కస్టమర్ సౌలభ్యం కోసం డీమ్యాట్ హోల్డింగ్స్‌కు సంబంధించి పోర్ట్‌ఫోలియో సేవలను సీడీఎస్‌ఎల్ లేదా సీఏఎంఎస్ అందిస్తాయి.  రెండు వ్యవస్థలు చేసే కార్యకలాపాలు ఒకటే.  సీడీఎస్‌ఎల్‌తో  పోర్ట్‌ఫోలియో సేవలకు మీరు సంతృప్తి చెందితే, ఇక సీఏఎంఎస్‌పై రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

 నాకు 56 సంవత్సరాలు. నా భార్యకు 53 ఏళ్లు. ఇద్దరి ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి వైద్య వ్యయ ఇబ్బందులూ లేవు. అయితే మా ఇరువురుకీ ముందు జాగ్రత్తగా ఆరోగ్య బీమా ప్రొడక్టును కొనుగోలు చేయాలనుకుంటున్నాను. రూ. ఐదు లక్షలు ఫ్లోటర్ ప్లాన్ అలాగే... చెరి రూ. 5 లక్షలు చొప్పున క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ తీసుకుందామన్నది ప్రణాళిక. వార్షిక ప్రీమియం రూ.40,000 చెల్లించే శక్తి నాకుంది. జీవితంలో ఎటువంటి ఆరోగ్య వ్యయ భారం లేని తగిన ఆరోగ్య బీమా ప్రణాళికను తెలియజేయగలరు.?
 - శర్మ, మైలవరం

 నిజానికి మీరు ఆరోగ్య బీమా తీసుకోవడంలో ఆలస్యం చేశారు. అదృష్టవశాత్తు మీకు ఇంతవరకూ అలాంటి అవసరమూ రాలేదు. అయితే మీ తరహా వ్యక్తులకు ‘ఆటో రిస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్’ ప్రణాళిక మంచిది. వైద్యానికి సంబంధించి ఒకవేళ సమ్ ఇన్సూర్డ్ బీమా పూర్తిగా పొందిన తరువాత కూడా, అదే ఏడాది మరోసారి మీకుగానీ, మీ కుటుంబ భాగస్వామికిగానీ మరేదైనా వైద్య అవసరం ఏర్పడితే...  ‘ఎటువంటి అదనపు ప్రీమియం చెల్లించనవసరం లేకుండానే’ మీరు చేసిన ‘సమ్ ఇన్సూర్డ్’పునరుద్ధరణ కావడమే ఈ ప్లాన్ ప్రత్యేకత. అయితే మిగిలిన బేసిక్ ఆరోగ్య బీమా పథకాలతో పోల్చితే... ‘ఆటో రిస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్’ ప్రీమియం కొంత అధికం. ఒక సంవత్సరం ఈ బీమా అవసరం పడని పక్షంలో నో క్లెయిమ్ బోనస్‌లు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఈ తరహా హెల్త్ పాలసీలకు సంబంధించి, అలాగే క్రిటికల్ ఇల్‌నెస్‌కు సంబంధించి క్రింది పాలసీలను నేను సిఫారసు చేస్తున్నాను. తుది నిర్ణయం మీదే..

Advertisement

What’s your opinion

Advertisement