బ్రోస్టర్‌ చికెన్‌ ఔట్‌లెట్ల విస్తరణ | Sakshi
Sakshi News home page

బ్రోస్టర్‌ చికెన్‌ ఔట్‌లెట్ల విస్తరణ

Published Wed, Feb 22 2017 1:24 AM

బ్రోస్టర్‌ చికెన్‌ ఔట్‌లెట్ల విస్తరణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ఫ్రాంచైజీ నిర్వహణ సంస్థ ‘ఎల్లో టై యాస్పిటాలిటీ’... అమెరికాకు చెందిన హెరిటేజ్‌ బ్రాండ్‌ జెన్యూన్‌ బ్రోస్టర్‌ చికెన్‌ (జీబీసీ)ను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. మంగళవారమిక్కడ ఫ్రాంచైజీ విధానంలో ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఫౌండర్‌ కరన్‌ టన్నా విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు దేశంలో బ్రోస్టర్‌ చికెన్‌ ఔట్‌లెట్లు ముంబై, రాయ్‌పూర్, సూరత్, కోల్‌కతా, పాట్నా నగరాల్లో ఐదు మాత్రమే ఉన్నాయి.

2017 ముగిసే నాటికి 50 ఔట్‌లెట్లను ప్రారంభించాలని లక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.60–70 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని.. ఆగస్టులోగా హిమాయత్‌నగర్, హైటెక్‌సిటీలతో పాటు విజయవాడలోనూ ఔట్‌లెట్‌ను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఔట్‌లెట్‌ యజమాని వందన షెటే, కరన్‌ షెటే కూడా పాల్గొన్నారు.

Advertisement
Advertisement