అనుమానాస్పద మృతి: దహన సంస్కారాలను అడ్డుకున్న పోలీసులు

7 Nov, 2019 09:31 IST|Sakshi

సాక్షి, ఏలూరు: ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అతని కుమారులు హడావుడిగా మృతదేహానికి దహనసంస్కారాలు చేయటానికి ప్రయతి్నంచారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి దహన సంస్కారాలను నిలుపుదల చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి, విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో మృతుని బంధువులు, చుట్టుపక్కల స్థానికులు ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఏలూరు వన్‌టౌన్‌ ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి బంధువులు, మృతుని కుమారులను ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.  

ఏలూరు వన్‌టౌన్‌ మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం సమీపంలో ఇ.వెంకటేశ్వరరెడ్డి (50) కిళ్లీకొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సాయికృష్ణ తాపీపని చేస్తుండగా, చిన్న కుమారుడు రామకృష్ణ రైతు బజార్‌లో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో తండ్రి వెంకటేశ్వరరెడ్డిని కుమారుడు రామకృష్ణ, కుటుంబ సభ్యులు కొట్టడంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. తండ్రి వెంకటేశ్వరరెడ్డి మృతిచెందటంతో హడావుడిగా దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయతి్నంచారు. శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించి, చితిని పేర్చేందుకు సిద్ధపడ్డారు. మృతుడు వెంకటేశ్వరరెడ్డి అన్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సుబ్బారెడ్డి తమ్ముడు మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులే వెంకటేశ్వరరెడ్డిని కొట్టి చంపారంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై ఏలూరు వన్‌టౌన్‌ సీఐ వైబీ రాజాజీ ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కుమారుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని..

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సినిమా

భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..