Sakshi News home page

అమ్మవారి ఆలయంలో భారీ చోరీ

Published Tue, Jul 24 2018 1:26 PM

Gold Robbery In Durga Temple Guntur - Sakshi

మేడికొండూరు:  ఆలయంలో అమ్మవారి ఆభరణాల చోరీ ఘటన సోమవారం కలకలం రేపింది. ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ గ్రామంలోని మూల్యాంకేశ్వరి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోకి ప్రవేశించే షట్టరును పగలకొట్టిన దొంగలు గర్భగుడి ఇనుప ద్వారాన్ని సిమెంటు దిమ్మెలతో సహా ధ్వంసం చేశారు. అనంతరం 500 గ్రాముల అమ్మవారి వెండి కిరీటం, గర్భగుడిలో విగ్రహం పక్కనే ఉన్న రెండు బీరువాల్లోని రెండు వెండిప్లేట్లు, పంచహారతి ఇచ్చే వస్తువులు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని (పంచలోహం) ఎత్తుకెళ్లారు. ఆలయంలోని పురాత విగ్రహం సాయంతో హుండీని పగలకొట్టి డబ్బులను దొంగిలించారు. ఈ క్రమంలో ఆ విగ్రహం ధ్వంసం కావడంతో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో పడేశారు. మొత్తం రూ.2 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ పండితులు అయ్యన్న శాస్త్రి తెలిపారు.

ప్రొఫెషనల్స్‌ పనే..
రోజు మాదిరిగానే అమ్మవారికి నైవేధ్యం పెట్టడానికి పండితులు అయ్యన్న శాస్త్రి ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో షట్టరు తాళాలు పగలకొట్టి, విగ్రహాలు ధ్వంసం చేసిన ఉండటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఫిరంగిపురం ఎస్‌ఐ ఉజ్వల్‌ ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం సాయంతో పరిశీలించి, ఇది ప్రొఫెషనల్స్‌ పనేనంటూ తేల్చిచెప్పారు. 

Advertisement

What’s your opinion

Advertisement