అదే బావిలో అప్పుడు కొడుకు .. ఇపుడు తండ్రి..

16 Jun, 2019 07:58 IST|Sakshi

సాక్షి, రాజాం (శ్రీకాకుళం): నగర పంచాయతీ పరిధి లచ్చయ్యపేట గ్రామానికి చెందిన యిద్దుం గౌరీప్రసాద్‌ (45) బావిలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరపంచాయతీ పరిధి కొత్తవలస గ్రామ పంట పొలాల్లోని వ్యవసాయ బావిలో మృతదేహం పడి ఉండడాన్ని శనివారం కొంతమంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని మృతదేహాన్ని బయటకుతీశారు. ఈ నెల 13న నమోదైన మిస్సింగ్‌ కేసు ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బంధువులు మృతదేహాన్ని గౌరీప్రసాద్‌గా గుర్తించారు. మృతునికి మతిస్థిమితం సరిగాలేదని, ఇటీవల విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది మూడు రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడని బంధువులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ రాత్రి ఇంటి నుంచి బహిర్భూమికి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించామన్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరుగా విలపించారు.

మృతునికి భార్య లక్ష్మి ఉంది. కుమార్తెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. మృతి చెందిన గౌరీప్రసాద్‌ దేవాంగ కుటుంబానికి చెందిన వ్యక్తి. చేనేత వృత్తిద్వారా తగిన సంపాదన లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో పని చేస్తు జీవనం సాగించేవాడు. ఐదేళ్ల క్రితం ఆయన కుమారుడు గిరివాసు ఇదే బావిలోపడి మృతి చెందాడు. అప్పటి నుంచి గౌరీప్రసాద్‌ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రానురాను ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందన్నారు. భార్య లక్ష్మి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేదన్నారు. ఈ ఘటనపై మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఐదేళ్ల క్రితం ఇదే బావిలో పడి కుమారుడు మృతి.. 
గౌరీప్రసాద్‌ కుమారుడు గిరివాసు ఐదేళ్ల క్రితం ఇదే బావిలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు అదే బావిలో తండ్రి కూడా పడి మృతిచెందడం అందరినీ కలిచివేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!