ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

18 Sep, 2019 12:04 IST|Sakshi
గౌతమ్‌ గుప్తా(వైట్‌ టీషర్ట్‌)

న్యూఢిల్లీ : ప్రశాంతతను వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. ఇంటికి దూరంగా ప్రశాంతతను అన్వేషిస్తున్న తరుణంలో భార్య కారణంగా అతడు వెనక్కురావల్సి వచ్చింది. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీ పితామ్‌పురకు చెందిన గౌతమ్‌ గుప్తా అనే వ్యక్తి  ఈ నెల 11న ప్రశాంతతను వెతుక్కుంటూ ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భర్త వెళ్లిపోవటంతో అతడి భార్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా అతడి కదలికలను గుర్తించిన పోలీసులు అతడు ఉత్తరాఖండ్‌లో ఉన్నాడని కనుగొన్నారు. చివరకు రిషికేశ్‌లోని ఓ హోటల్‌లో ఉంటున్న అతడ్ని ఆదివారం ఢిల్లీకి తీసుకువచ్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా