అయ్యో! అపచారం.. నిందితుడి అరెస్ట్

4 Apr, 2018 19:52 IST|Sakshi
నిందితుడు సద్దాం హుస్సేన్ (ఫైల్ ఫొటో)

సాక్షి, చెన్నై : ఇటీవల శివలింగంపై కాళ్లు పెట్టి ఫొటో దిగిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులోనూ చెప్పులు ధరించి దర్జాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే నిందితుడికి ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. సద్దాం హుస్సేన్ (35) తిరు మూర్తి మండపం వద్దకు ఇటీవల తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అయితే పాదరక్షలతోనే గుడిలోకి వెళ్లాడు సద్దాం. అనంతరం శివలింగంపై మెకాలు పెట్టి ఫొటోలకు పోజులిచ్చాడు. 

ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. తమ మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు హిందూత్వవాదులు, మున్నాయ్ హిందూ గ్రూపు మమళ్లాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సద్దాం హుస్సేన్ ఛెంగల్‌పేట్ సబ్ జైలులో ఉన్నాడు. ఆ ఫొటోలో సద్దాం పక్కన ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు