కాపురంలో చిచ్చుపెడుతున్నాడని.. | Sakshi
Sakshi News home page

కాపురంలో చిచ్చుపెడుతున్నాడని..

Published Wed, Nov 22 2017 12:37 PM

men arrest in murder case - Sakshi

సజావుగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెడుతున్నాడని అనుమానించాడు... తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకునేలా ప్రోత్సహిస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు.. అదును చూసి.. ఆదమరచి నిద్రిస్తున్న వేళ గొడ్డలితో వేటేసి మట్టుబెట్టాడు .. ఇదీ.. పక్షం రోజుల క్రితం హుజూర్‌నగర్‌ మండలం అమరవరంలో ఓ వ్యక్తి దారుణహత్య వెనుక ఉన్న ప్రధాన కారణం.

హుజూర్‌నగర్‌ : వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటు ంబ కలహాలకు కారణమయ్యాడనే ఉద్దేశంతో సమీప బంధువే దారుణానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నర్సింహారెడ్డి నిం దితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. హుజూర్‌నగర్‌ మండలం అమరవరానికి చెం దిన పోసాని బాలసైదులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నా డు. సైదులు భార్య గ్రామంలోని ఓ వ్యక్తితో సఖ్యతగా మెలుగుతోందని.. అందుకు అదే గ్రామానికి చెందిన తన సమీప బంధువు పోసాని లింగస్వామి (35) ప్రోత్సహిస్తున్నాడని అనుమానించాడు.

అదును చూసి వేటేసి..
లింగస్వామి తీరుపై విసిగివేసారిన సైదులు అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీన లింగస్వామి భార్య తిరుపతమ్మ ఇద్దరు పిల్లలతో కలిసి దైవదర్శానికి తిరుపతికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగస్వామి ఈ నెల 7వ తేదీన ఉదయం పూటుగా మద్యం సేవించి ఇంట్లోనే మంచంపై నిద్రపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సైదులు అతడి ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న గొడ్డలితో లింగస్వామి తలపై నరికి పారిపోయాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న లింగస్వామిని అతడి తల్లి గమనించింది. చికిత్స నిమిత్తం లింగస్వామిని హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

అనుమానంతో..
మృతుడు లింగస్వామి బావమరిది లక్ష్మణ్‌  ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లింగస్వామి, బాలసైదులుకు ఉన్న తగాదాల నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. సైదులును అనుమానంతో అదుపులోకి తీసుకుని విచా రించగా ఘాతుకానికి ఒడిగట్టింది తానేనని అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, పోలీస్, ఐడీ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

పలుమార్లు ఘర్షణలు
బాలసైదులు తన భార్య విషయంలో పలు మార్లు లింగస్వామితో పలు మార్లు ఘర్షణ ప డ్డాడు. వీరిద్దరి తగా దాలు గ్రామ పెద్దల స మక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అయితే, లింగస్వామి తన తీరు మార్చుకోవడం లేదని సైదులు కక్ష పెంచుకున్నాడు.

Advertisement
Advertisement