అనంతపురంలో ఎమ్మార్పీఎస్‌ నాయకుడి దారుణహత్య

30 Nov, 2019 18:41 IST|Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం పట్టణంలోని చిన్మయినగర్‌లో శనివారం దారుణం చోటు చేసుకుంది. సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్‌లో అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపారు. అంతేగాక పోలీసులు వచ్చేంత వరకు వ్యక్తిని హతమార్చిన నిందితుడు అక్కడే కూర్చొని ఉండడం గమనార్హం. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా హత్యకు గురైంది ఎమ్మార్పీఎస్‌ నాయకుడు జగ్గుల ప్రకాశ్‌ అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది బుక్కరాయ సముద్రం రమణ అని నిర్థారించారు. గతంలో తన భార్యకు, తనకు గొడవ విషయంలో ప్రకాశ్‌ డబ్బులు తీసుకొని న్యాయం చేస్తానని చెప్పి మోసం చేయడంతో రమణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తబ్లీగి జమాత్‌: క్రిమినల్‌ కేసు నమోదు.. అరెస్టు

మద్యం డోర్‌ డెలివరీ అంటూ రూ. 50వేలు టోకరా

ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం 

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని..

సినిమా

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి