Sakshi News home page

పిజ్జా తెస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తా..

Published Sat, Apr 21 2018 2:58 PM

Policewoman Demands Free Pizza And Chilly Chicken For Registering FIR - Sakshi

లక్నో : ఈ రోజుల్లో లంచం తీసుకోవడమనేది సర్వ సాధారణమైపోయింది. లంచం అనగానే పెద్ద మొత్తంలో డబ్బు లేదా విలువైన వస్తువులు డిమాండ్‌ చేస్తారు. అయితే ఫిర్యాదు స్వీకరించడానికి ఓ మహిళా ఎస్‌ఐ చేసిన డిమాండ్‌ చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేద్దామని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఓ రెస్టారెంట్‌ యజమానికి వింత అనుభవం ఎదురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నా..  ఎఫ్‌ఐఆర్‌ కాపీ కావాలన్నా రెస్టారెంట్‌ నుంచి పిజ్జా, చిల్లీ చికెన్‌ తీసుకురావాలంటూ ఇన్స్‌పెక్టర్‌ సుమిత్రా దేవి అతడిని డిమాండ్‌ చేసింది. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న రెస్టారెంట్‌ యజమాని ఆమె అడిగిన పిజ్జా తీసుకువచ్చాడు. అయితే ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది. విచారణ జరిపిన అధికారులు ఈ విషయం నిజమని తేలడంతో ఆమెను సస్పెండ్‌ చేశారు.

ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో పోలీసులు తనకు డబ్బులు చెల్లించారని రెస్టారెంట్‌ యజమాని రోహిత్‌ బేరీ పేర్కొన్నాడు. లక్నోలోని హసన్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

What’s your opinion

Advertisement