లారీ ఢీకొని భార్యాభర్తల మృతి

16 Aug, 2019 10:30 IST|Sakshi
భీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నంబూరి రాణి, తీవ్రగాయాలతో కన్నుమూసిన నంబూరి సత్యానందం

సాక్షి, పశ్చిమగోదావి: కూరగాయల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భార్యాభర్తలు లారీ ఢీకొని మృత్యువాతపడిన విషాద ఘటన భీమడోలు లో చోటుచేసుకుంది. లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. భీమడోలు పంచాయతీ శివారు పెదలింగంపాడుకు చెందిన భార్యాభర్తలు  నం బూరి సత్యానందం (50), నంబూరి రాణి (45) గురువారం సాయంత్రం కూరగాయలు కొనేం దుకు మోటార్‌సైకిల్‌పై భీమడోలు వచ్చారు. తిరిగి తమ ఇంటికి వెళుతుండగా భీమడోలు కనకదుర్గమ్మ గుడి వద్ద డివైడర్‌ను దాటే క్రమంలో ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో రాణి అక్కడికక్కడే మృతిచెందగా సత్యానందంకు తీవ్రగాయాలయ్యాయి.

ఎస్సై కె.శ్రీ హరిరావు సంఘటనా స్థలానికి చేరుకుని సత్యానందంను 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. సత్యానందం వట్లూరులోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రాణి వ్యవసాయ కూలీ పనులు చేస్తుంది. వీరికి పిల్ల లు లేరు. ఘటనా స్థలాన్ని సీఐ ఎం.సుబ్బారావు పరిశీలించారు. లారీ డ్రైవర్‌ పరారయ్యాడు.  భీ మడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి అకాల మరణంతో పెదలిం గపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు