Sakshi News home page

బోరుబావి ఘటనపై ఇప్పటివరకూ..

Published Sat, Nov 28 2015 4:29 PM

బోరుబావి ఘటనపై ఇప్పటివరకూ..

మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెంలో శనివారం ఉదయం బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు రాకేష్ అనే చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్యూబ్ సాయంతో బావిలోకి ఆక్సిజన్ పంపుతున్నారు. జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా పెద్ద గుంత తవ్వుతున్నారు. సహాయక పనుల్లో నిర్లక్ష్యం జరుగుతోందని బంధువులు, స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి సమాచారం.
 

  • మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం
  • హైదరాబాద్ కు 70కి.మీ దూరంలో గ్రామం
  • ఉ. 7:45గంటలకు బోరుబావిలో పడ్డ మూడేళ్ల రాకేష్
  • రాత్రివేసిన బోరుబావిలో పడిపోయిన రాకేష్
  • బోరులో పడని నీరు, 50 మీ. దూరంలో మరో బోరుబావి
  • బోరుబావిని మూసివేయని సిబ్బంది
  • అడుకోవడానికి అన్నతో వెళ్లిన రాకేష్
  • బోరుబావిలో పడిపోయిన రాకేష్
  • జారిపడిపోతున్న తమ్ముడ్ని పట్టుకునేందుకు అన్న యత్నం
  • రాకేష్ అన్న బాలయ్య వయస్సు ఐదు సంవత్సరాలే
  • శక్తి చాలకపోవడంతో తమ్ముడ్ని కాపాడలేకపోయిన బాలయ్య
  • అన్నకళ్లముందే బోరుబావిలో పడిపోయిన రాకేష్
  • తాళ్లతో రాకేష్ ను బయటకు తీసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం
  • ఉ. 8:20గంటలకు 108 కు సమాచారం
  • ఉ. 8:32 గంటలకు ఘటనాస్థలానికి 108
  • ఉదయం 8:45 గంటలకు బోరుబావిలో రాకేష్ కు ఆక్సిజన్
  • ఉ. 9 గంటలకు బోరుబావి వద్దకు చేరుకున్న పోలీసులు
  • మధ్యాహ్నం 12:20 గంటలు: ఘటనాస్థలానికి చేరుకున్న మొదటి ప్రొక్లెయిన్
  • మధ్యాహ్నం 2 గంటలు : ఘటనాస్థలానికి చేరుకున్న రెండో ప్రొక్లెయిన్
  • ఘటనాస్థలంలో కనిపించని నిపుణుల బృందం, కనిపించని ఇంజినీర్లు
  • స్థానిక సీఐ, ఎస్సై, ఆర్డీఓల నేతృత్వంలోనే పనులు
  • సరైన యంత్ర సామగ్రిలేక మందకొడిగా సహాయక చర్యలు
  • ఘటనా స్థలానికి కేవలం రూ. 15 కి.మీ దూరంలోనే కలెక్టర్ కార్యాలయం
  • ఘటనాస్థలంలో కనిపించని జిల్లాస్థాయి అధికారులు
  • మధ్యాహ్నం  3:15 ఇప్పటివరకూ 6 అడుగులమేర మట్టి తవ్వకం
  • సహాయక పనుల్లోనిర్లక్ష్యం జరుగుతోందని బంధువులు, స్థానికుల ఆగ్రహం
  • సాయంత్రం 6:00 గంటలకు కూడా బాలుడ్ని వెలికితీయలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Advertisement

What’s your opinion

Advertisement