కూలీ వద్ద 9 కిలోల బంగారం! | Sakshi
Sakshi News home page

కూలీ వద్ద 9 కిలోల బంగారం!

Published Tue, Jan 17 2017 11:26 PM

9 kilos gold captured of labour

విచారణ చేపడుతున్న విజిలెన్స్‌ అధికారులు
ఉరవకొండ : విడపనకల్లు మండలం వి.కొత్తకోటకు చెందిన ఒక కూలీ వద్ద ఏకంగా తొమ్మిది కిలోల బంగారం ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారుల విచారణలో తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు ప్రతి ఏటా పనులకోసం ముంబై వెళుతుంటారు. వీరిలో ఒక కూలీ ప్రతి ఏటా కిలో  చొప్పున అలా తొమ్మిది కిలోల బంగారం పోగు చేసినట్లు సమాచారం. పెద్దనోట్ల రద్దు అయిన సమయంలో గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లో గల తన 8 బ్యాంకు ఖాతాల్లో ఈ బంగారాన్ని భద్రపరిచాడు.

రెండు నెలల క్రితం విజిలెన్స్‌ అధికారులు చేపట్టిన విచారణలో వి.కొత్తకోట గ్రామానికి చెందిన వ్యక్తి ఖాతాల్లో తొమ్మిది కిలోల బంగారం ఉన్నట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. నెల క్రితం వి.కొత్తకోట గ్రామానికి ఇద్దరు విజిలెన్స్‌ అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్ళినట్లు తెలిసింది. దీనిపై విడపనకల్లు ఎస్‌ఐ రత్నంను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.

Advertisement
Advertisement