ప్రేమించాలంటూ వేధింపులు.. వ్యక్తి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ప్రేమించాలంటూ వేధింపులు.. వ్యక్తి అరెస్ట్

Published Wed, Oct 5 2016 9:23 PM

ప్రేమించాలంటూ వేధింపులు.. వ్యక్తి అరెస్ట్ - Sakshi

హైదరాబాద్: ప్రేమించమని యువతిని వేధిస్తున్న వ్యక్తిని షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్‌బీనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా నేరెడుచెర్లకు చెందిన ఓ యువతి (25) ఎల్‌బీనగర్, మన్సూరాబాద్ రాక్‌టౌన్‌కాలనీలో నివాసం ఉంటోంది. ఆ యువతి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సంస్థలో మల్టీమీడియాలో శిక్షణ తీసుకుంటోంది.

రాక్‌టౌన్‌కాలనీకి చెందిన హరినాధ్‌రెడ్డి (33)కి గతంలోనే వివాహమైంది. శిక్షణ తరగతి క్లాసులకు హాజరవుతున్న యువతిని గత కొన్ని రోజుల నుంచి ప్రేమించమంటూ హరినాధ్‌రెడ్డి వేధిస్తున్నాడు. దీంతో అతడి వేధింపులు భరించలేని యువతి ఈ విషయాన్ని షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు షీ టీమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బుధవారం హరినాధ్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఎల్‌బీనగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement