-
మహిళను వేధించిన కాంగ్రెస్ లీడర్.. ఫ్రెండ్స్‌తో వచ్చి చితకబాదిన లవర్
బెంగళూరు: మహిళను లైంగికంగా వేధించిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు. తన సెలూన్లో బ్యుటీషియన్‌గా పనిచేసే మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ధార్వాడ్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. తాను సెలూన్లో ఉన్నప్పుడు మనోజ్ వచ్చి బలవంతంగా వాటేసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు జరిగిన విషయాన్ని తన ప్రియుడికి వెంటనే తెలియజేసింది. దీంతో అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సెలూన్‌కు వచ్చి కాంగ్రెస్ నేతను చితకబాదాడు. మనోజ్ కర్జాగిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అతను తమ హయాంలో ఓ మంత్రికి సహాయకుడిగా పనిచేశాడని కాంగ్రెస్ తెలిపింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోజ్ నార్త్‌వెస్ట్ కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ డైరెక్టర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
మస్కట్‌లో మహిళ ‘గోస’.. 10 రోజుల నుంచి ఫోన్ స్విచ్చాఫ్
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): నిరుపేద కుటుంబం. భర్త వికలాంగుడు. ఎదిగిన కొడుకు ప్రేమ పెళ్లి చేసుకొని ఇల్లు విడిచి వెళ్లాడు. దీంతో ఆ పేద మహిళకు ఇంటి పోషణ భారం కావడంతో ఓ గల్ఫ్ ఏజెంట్ ద్వారా 36 రోజుల క్రితం మస్కట్ వెళ్లింది. అక్కడ ఇంటి యజమాని పెట్టే చిత్రహింసలకు నరకం అనుభవిస్తున్నట్లు 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుండగా స్విచ్ ఆఫ్ ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన కొదురుపాక సత్తమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలు అదే కాలనీకి చెందిన రమాదేవికి చెప్పుకోగా, ఆమె తన అన్న నిజామాబాద్‌లో గల్ఫ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న రవికుమార్‌కు పరిచయం చేయించింది. ఈ క్రమంలో రవికుమార్, సత్తమ్మ వయస్సుతో పాటు మతం (క్రిస్టియన్‌గా) మార్చి పాస్‌పోర్టు తీయించాడు. నవంబర్ 4న ఇంటి పని కోసమని మస్కట్‌కు పంపించాడు. అక్కడకు చేరుకున్న సత్తమ్మ ఇంటి యజమానితో తాను హిందువు అని చెప్పడంతో ఆమెను తీవ్ర వేధింపులతో పాటు అనవసరమైన పనులు చేయించడం.. చేయకపోతే దాడిచేయడంతో చెయ్యి కూడా విరిగిపోయిందని 15 రోజుల క్రితం బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు గల్ఫ్ ఏజెంట్ రవికుమార్ వద్దకు వెళ్లగా, తాను మస్కట్‌కు పంపించేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు అయిందని, ప్రస్తుతం రూ.లక్ష చెల్లిస్తే స్వగ్రామం రప్పిస్తానని చెప్పాడు. వారి వద్ద డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో జగిత్యాలలోని గల్ఫ్ సోషల్ వర్కర్ షేక్ చాంద్‌పాషాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతడు స్పందించి సత్తమ్మను స్వగ్రామం రప్పించేందుకు గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్‌తో పాటు భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశాం జిల్లా కేంద్రానికి చెందిన సత్తమ్మకు గల్ఫ్ ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టు ఇప్పించి మస్కట్ పంపించాడు. అక్కడ యజమాని ద్వారా ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం అందించడంతో పాటు మస్కట్ భారత రాయబార కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశాం. – షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ సోషల్ వర్కర్, జగిత్యాల చదవండి: యువతి అదృశ్యం -
ప్రేమించాలంటూ వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ప్రేమించమని యువతిని వేధిస్తున్న వ్యక్తిని షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా నేరెడుచెర్లకు చెందిన ఓ యువతి (25) ఎల్బీనగర్, మన్సూరాబాద్ రాక్‌టౌన్‌కాలనీలో నివాసం ఉంటోంది. ఆ యువతి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సంస్థలో మల్టీమీడియాలో శిక్షణ తీసుకుంటోంది. రాక్‌టౌన్‌కాలనీకి చెందిన హరినాధ్‌రెడ్డి (33)కి గతంలోనే వివాహమైంది. శిక్షణ తరగతి క్లాసులకు హాజరవుతున్న యువతిని గత కొన్ని రోజుల నుంచి ప్రేమించమంటూ హరినాధ్‌రెడ్డి వేధిస్తున్నాడు. దీంతో అతడి వేధింపులు భరించలేని యువతి ఈ విషయాన్ని షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు షీ టీమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బుధవారం హరినాధ్రెడ్డిని అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement