ఆదినుంచీ అవాంతరాలే | Sakshi
Sakshi News home page

ఆదినుంచీ అవాంతరాలే

Published Fri, Aug 26 2016 12:29 AM

Adinunci hassles

  • 600 మెగావాట్ల ప్లాంట్‌పై కమ్ముకున్న చీకటి తెరలు
  • ఈ నెలలో ఇప్పటికి మూడుసార్లు ఉత్పత్తికి బ్రేక్‌
  • మరమ్మతులకు నెల రోజులు 
  • పట్టవచ్చంటున్న అధికారులు
  • గణపురం :  మండలంలోని చెల్పూరు శివారులో గల కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం లోని 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌లో ఉత్పత్తికి పలుమార్లు అంతరాయం కలుగుతుండటంతో నష్టాల బాట పట్టింది. ప్లాం ట్‌పై చీకటి తెరలు కమ్ముకున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే మూడుసార్లు ఉత్పత్తి నిలిపోయింది. గత ఆరు రోజులుగా ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. జూలైలోనూ రెండు పర్యాయాలు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది జనవరి 5న విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏకధాటిగా 15 రోజులు ఉత్పత్తి అయిన సందర్భం లేదు.  
     
    వాస్తవానికి ప్లాంట్‌ ప్రారంభిం చిన రెండు నెలలకు కానీ సీఓడీ ప్రకటన రాలేదు. సీఓడీ జరిగిన తరువాత ప్లాంట్‌లో వారం, పది రోజులకోమారు విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం జనరేటర్‌ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేయడానికి నెల రోజులు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్లాంట్‌లో తరుచూ అంతరాయం ఏర్పడుతుండడంతో కేటీపీపీకి భారీ నష్టం వాటిల్లుతోంది. 600 మెగావాట్ల ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి జరిగే విద్యుత్‌ 24 గంటలకు 14.5 మిలియన్‌ యూనిట్లు ఉంటుంది. యూనిట్‌కు రూ.5 చొప్పున విలువ కట్టినా రోజుకు కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. 

Advertisement
Advertisement