వ్యవసాయ కళాశాలలకు రూ.93 కోట్లు | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కళాశాలలకు రూ.93 కోట్లు

Published Tue, Nov 22 2016 2:33 AM

Agricultural colleges, Rs 93 crore

వర్ని : రాష్ట్రంలోని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్ సీడ్ టెక్నాలజీ భవనాల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.93 కోట్లు మంజూరు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో రూ.12 కోట్లతో నిర్మిస్తున్న ఫుడ్, సైన్‌‌స అండ్ టెక్నాలజీ కళాశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించా రు. సాధ్యమైనంత తొందరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం కళాశాలలో కోర్సు లు, విద్యార్థుల సంఖ్య, తదితర వివరాలు కళాశాల అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. 
 
 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోనే రుద్రూర్ ఫుడ్ టెక్నాలజీ కళాశాల మొట్ట మొదటిదన్నారు. సంగారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు రూ.19.7 కోట్లు, రాజేంద్రనగర్‌లో హాస్టల్‌కు రూ.7కోట్లు, పరీక్ష హాలు నిర్మాణాని కి రూ.6 కోట్లు, కరీంనగర్ పరిశోధన కేంద్రానికి రూ.2 కోట్లు, మంజీరా పరిశోధన కేంద్రానికి రూ.3 కోట్లు, రుద్రూర్ ఫుడ్ టెక్నాలజీ కళాశాలకు రూ.12 కోట్లు, హాస్టల్‌కు రూ.5 కోట్లు, సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలకు రూ.7 కోట్లు, తోర్నాల పాలిటెక్నిక్ కళాశాలకు రూ.10 కోట్లు, జమ్మికుంట పాలిటెక్నిక్ కళాశాలకురూ.7కోట్లు, జగిత్యాల వ్యవసాయ కళాశాలకు రూ.15కోట్లు కేటారుుంచినట్లు మంత్రి తెలిపారు.
 
  రాష్ట్రంలో నాలుగు వ్యవసాయ కళాశాలలతో పాటు 11 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు, రుద్రూర్ సీడ్ టెక్నాలజీ, సంగారెడ్డి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు రాష్ట్రంలో 15 వ్యవసా య పరిశోధన కేంద్రాలు ఉన్నాయని మంత్రి వివరించారు. మంత్రి వెంట జెడ్పీటీసీ సభ్యు డు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ రామాగౌడ్, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాము, నాయకులు సురేందర్ రెడ్డి, సారుులు, పరిశోధన కేంద్రం అధిపతి జోసఫ్ ఉన్నారు. 
 
 అధికారులపై ఆగ్రహం..
 కోటగిరి : ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే కాంట్రాక్ట ర్లు, అధికారులు నాసిరకం పనులు చేపట్టడం పై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కోటగిరి మండలంలోని దోమలెడ్గి, టాక్లీ, సోంపూర్, రాంగంగానగర్ గ్రామాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. దోమలెడ్గిలో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కాగా ప్రస్తుతం మంజూరైన 40 డబుల్ బెడ్‌రూం ఇళ్లు సరిపోవని స్థానిక సర్పంచ్ అనంత విఠల్ మంత్రి దృష్టికి తీసుకురాగా, నిర్మాణాలకు స్థలం ఉంటే లబ్ధిదారులందరికీ మంజూరు చేరుుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దోమలెడ్గి చెరువు పనులు నాసిరకంగా చేపట్టారని కొందరు గ్రామస్తులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి ఆగ్రహించిన మంత్రి పనులు జరిగేటప్పుడు మీరందరు ఎక్కడికి పోయారని వారిపై మండిపడ్డారు. 
 
 వెంటనే కాలువ లైనింగ్ పనులు చేట్టాలని, చెరువు అలుగు ఎత్తు పెంచాలని, పోచమ్మ చెరువు వద్ద ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రబీలో పంటల సాగుకు డిసెంబ ర్ 1 నుంచి 14వ తేదీ వరకు నిజాంసాగర్ నీటి ని విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నా రు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటితో నారు పోసుకోవాలని, రబీ, ఖరీఫ్‌లో పంటలకు సాగర్ నీరు సరిపోతుందన్నారు. ఖరీఫ్‌కు నీరు సరిపోకపోతే సింగూరు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
 

Advertisement
Advertisement