ఆసనాల్లో ఆణిముత్యం | Sakshi
Sakshi News home page

ఆసనాల్లో ఆణిముత్యం

Published Mon, Jul 25 2016 12:53 AM

ఆసనాల్లో ఆణిముత్యం

కరీమాబాద్‌ : నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ బిజీలైఫ్‌ను గడుపుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పనిఒత్తిడితో సతమతమవుతున్నారు.
ఈ క్రమంలో అనేక రోగాల బారినపడాల్సి వస్తుంది. అయితే పని ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతో దోహదపడుతోంది. అలాంటి యోగాలో జిల్లాస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటుతోంది ఓ విద్యార్థిని. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రంగశాయిపేటకు కోరె ధనుంజ య్, భాగ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇందులో రెండో కూతురు భవిష్యకు చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఇష్టం. అయితే చదువులో ప్రతిభ కనబరచాలంటే యోగా ఆసనాలు ఎంతో దోహదపడు తాయని పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన మాటలను ఆమె ఆసక్తిగా విన్నారు. దీంతో ఎలాగైనా యోగా నేర్చుకోవాలని నిర్ణయించుకుంది.
6వ తరగతిలో ప్రారంభం
భవిష్య 1వ తరగతి నుంచి 10 వరకు వరంగల్‌లోని రంగశాయిపేటలో చదువుకుంది. 6వ తరగతి చదువుతున్నప్పుడు యోగా నేర్చుకునేందుకు ఆమె ఆసక్తి చూపింది. ఈ మేరకు యోగా మాస్టర్‌ కమలాకర్‌ వద్ద ఆమె శిక్షణ పొందింది. ఆరేళ్లుగా యోగాలో రాణిస్తూ ఎన్నో బహుమతులు సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం భవిష్య ఖిలా వరంగల్‌ రోడ్డులోని ఏఎస్‌ఎం కళాశాలలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. 
భవిష్య వేసే ఆసనాలు
అందరిలా కాకుండా భవిష్య క్లిష్టమైన ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తోంది. ప్రధానంగా ఆమె తితిబాసన్, కౌండిన్యాసన్, మై గ్రాసన్, భూమాసన్, శీర్షాసన్, బకాసన్, మయూరాసన్, పద్మబకాసన్, శీర్షపద్మాసన్‌ తదితర ఆసనాలు వేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
ఎన్నో పోటీలకు హాజరు
l 2011 ఆగస్టు 26న వరంగల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలోజరిగిన పోటీల్లో భవిష్యకు తృతీయ బహుమతి.
∙2012లో వరంగల్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ భవన్‌లో జరిగిన పోటీల్లో మెుదటి బహుమతి.
∙2010–11 అక్టోబర్‌ 29 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు.
l 2013–14 అక్టోబర్‌ 16 నుంచి 18 వరకు వరంగల్‌లోని జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ బహుమతి.
l 2014–15 అక్టోబర్‌ 8 నుంచి 10 వరకు హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి.
l 2015–16 నవంబర్‌ 27 నుంచి 29 వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి.
l 2013 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీలకు హాజరు.
l 2012 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు బెంగళూరులో జరిగిన అంతర్జాతీయస్థాయి పోటీలకు హాజరు. 

Advertisement
Advertisement