పాత పింఛన్‌ విధానం వర్తింపజేయాలి | Sakshi
Sakshi News home page

పాత పింఛన్‌ విధానం వర్తింపజేయాలి

Published Mon, Jul 18 2016 4:32 PM

apply old pension system

డీఎస్సీ 2003 పాత పింఛన్‌ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్‌

వికారాబాద్‌ రూరల్‌ : డీఎస్సీ 2003 నోటిఫికేషన్‌లో సీపీఎస్‌ నూతన పింఛన్‌ విధానం లేదని డీఎస్సీ 2003 పాత పింఛన్‌ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు గణపురం సురధీర్‌ తెలిపారు. వికారాబాద్‌లోని ఓ జూనియర్‌ కళాశాలలో ఆదివారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛ¯ŒS విధానం, జీపీఎఫ్‌ అవకాశం కల్పించాలని కోరారు. జిల్లా కమిటీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కాంట్రిబ్యూటరీ పింఛ¯ŒS విధానంతో ఉపాధ్యాయులకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు బుచ్చరషు, ప్రధాన కార్యదర్శి బిచ్చన్న, జిల్లా ఉపాధ్యక్షుడులు సురేందర్, నక్క రవీందర్, శ్రీనివాస్, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు జి.కె నర్సిములు, లక్ష్మికాంత్‌, సంగమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement