'ఆ హామీలు, స్కీములన్నీ ఓట్లు నోట్లు కోసమే' | Sakshi
Sakshi News home page

'ఆ హామీలు, స్కీములన్నీ ఓట్లు నోట్లు కోసమే'

Published Wed, Jun 22 2016 3:25 PM

Bhatti vikramarka slams kcr

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హమీలన్నీ ఓట్ల కోసం, స్కీములన్నీ నోట్ల కోసమేనని టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. బుధవారం కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కొత్త జిల్లాల విభజనతో టీఆర్ఎస్ బలపడుతుందే తప్ప ప్రజలకు మాత్రం ప్రయోజనం శూన్యమన్నారు. ఒక్కో నియోజకవర్గానికి లక్షా 50వేల మందిని తయారుచేసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement
Advertisement