బిల్ట్‌ పునరుద్ధరణ బాధ్యత రాష్ట్రానికి లేదా? | Sakshi
Sakshi News home page

బిల్ట్‌ పునరుద్ధరణ బాధ్యత రాష్ట్రానికి లేదా?

Published Sun, Sep 11 2016 11:49 PM

బిల్ట్‌ పునరుద్ధరణ బాధ్యత రాష్ట్రానికి లేదా?

  • కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
  • ములుగు : బీజేపీ ములుగు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం మండలకేంద్రానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వచ్చారు. ఈసందర్భంగా ఆయనను బిల్ట్‌ కార్మికులు, బీఎంఎస్‌ కార్యకర్తలు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. గత 17 నెల లు గా పెండింగ్‌లో ఉన్న వేతనాలను అందించాలన్నారు. బిల్ట్‌ పునరుద్ధరణకు సహకరిం చాలని కోరారు.  దీనిపై స్పందించిన కేంద్రమంత్రి దత్తాత్రేయ రాష్ట్రంలోని పరిశ్రమను పునరుద్ధరించే బా ధ్యత రాష్ట్రానికి లేదా అని ప్రశ్నించారు. బిల్ట్, నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు.  కార్మికుల వేతనాలు అందేలా తాను సహకరిస్తానన్నారు. బీఎంఎస్‌ కార్యకర్తలు లిం గంపల్లి శ్రీనివాస్, పాకాల యాదవరెడ్డి, బాలసాని కొ మురయ్య, చుంచు శ్రీరంజన్, చిర్ర వెంకటేశ్వర్లు, రామి డి సురేశ్, కార్మికులు సుభాష్, బండారి వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, భిక్షపతి,  వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement