కేసీఆర్..ఒవైసీకి భయపడుతున్నారు | Sakshi
Sakshi News home page

కేసీఆర్..ఒవైసీకి భయపడుతున్నారు

Published Sat, Sep 17 2016 7:49 PM

కేసీఆర్..ఒవైసీకి భయపడుతున్నారు - Sakshi

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  విముక్తి దినం జరపకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేసీఆర్ ఎవరంటే భయపడుతున్నారని, ఒవైసీ అంటే ఆయన భయపడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మాత్రం ఎవరికీ భయపడటం లేదని, తమను విముక్తి దినం జరపకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ఈ సభలో అమిత్ షా ఏం మాట్లాడారంటే..

  • ఇది భద్రకాళి జన్మభూమి. ఈ భూమికి ప్రణామాలు. రాణీ రుద్రమదేవి భూమికి ప్రణామాలు
  • ఈరోజు సెప్టెంబర్ 17.. నరేంద్ర భాయి పుట్టినరోజు కూడా
  • బీజేపీ శ్రేణులన్నీ సేవాదినం పేరుతో దీన్ని జరుపుకొంటున్నాయి
  • ఇది సర్దార్ పటేల్ వీరత్వం కారణంగా నిజాం తలొంచిన రోజు
  • మరాఠ్వాడా, తెలంగాణ ఈ ప్రాంతాలన్నింటిలో నిజాం అరాచకాలపై పోరాటం జరిగింది.
  • అందరికీ ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.. ఇక్కడ మాత్రం ప్రజలకు స్వాతంత్ర్యం రాలేదు
  • ఇక్కడ కొమురం భీం, రామానంద తీర్థ, హనుమంతరావు తదితర దేశభక్తులు రజాకార్లపై ఉద్యమించారు
  • నిజాంపై పోరాటం చేసిన యోధులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా
  • కేసీఆర్ ఎవరికి భయపడి విముక్తి దినం జరపడం లేదు?
  • ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక్కడ ఒవైసీ అంటే భయపడుతున్నారు
  • కేసీఆర్ ప్రజల భావాలను అర్థం చేసుకోవాలి.. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఒవైసీ కాదు.. తెలంగాణ ప్రజలు
  • మీ ప్రాధాన్యం ఒవైసీ అయితే.. 2019 ఎన్నికల్లో ప్రజలు మీకు గట్టిగా సమాధానం చెబుతారు
  • 2014లో కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణను బలోపేతం చేసేందుకు 90వేల కోట్లకు పైగా సాయం చేసింది
  • బీజేపీ ప్రభుత్వం ఏమైనా చెబితే చేసి తీరుతుంది.
  • మేం గెలిస్తే సరిహద్దులను సురక్షితం చేస్తామని చెప్పాం
  • రాహుల్ బాబా తెలుసు కదా.. మోదీ వచ్చిన తర్వాత కూడా కశ్మీర్ రోడ్ల మీద కాల్పులు జరుగుతున్నాయి, తేడా ఏముందని ఆయన అడుగుతున్నారు
  • తేడా మీకు తెలియదు.. తెలియాలంటే సరైన దృష్టికోణం ఉండాలి
  • కాంగ్రెస్ హయాంలో పాక్ వాళ్లు కాల్పులు మొదలుపెట్టి, వాళ్లే ముగించేవాళ్లు
  • మోదీ ప్రభుత్వంలో ఇప్పుడూ వాళ్లే మొదలుపెడుతున్నారు. కానీ ముగించేది మాత్రం భారత సైన్యమే
  • కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది
  • ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద ఈ రెండున్నరేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు
  • మోదీ విదేశాలకు ఎక్కువగా వెళ్తున్నారని గులాం నబీ ఆజాద్ అంటున్నారు
  • నిజానికి మన్మోహన్ సింగ్ కంటే తక్కువగానే విదేశాలకు మోదీ వెళ్లారు
  • గతంలో మౌనీ బాబా మన్మోహన్ ఎక్కడకువెళ్లినా ఎవరికీ తెలిసేది కాదు
  • ఇంగ్లీషులో రాసుకున్న రెండు ముక్కలు తీసుకెళ్లి చదివేవారు.
  • చీటీలు మారిపోతే థాయ్‌లాండ్ స్పీచ్ మలేషియాలో్ను, అక్కడిది ఇక్కడ మాట్లాడేసేవారు
  • ఇప్పుడు మోదీ ఏ దేశం వెళ్లినా వేలాదిమంది మోదీని స్వాగతిస్తున్నారు
  • ఈ స్వాగతం మోదీకి లభించినది కాదు, బీజేపీది కాదు.. ఇది దేశంలోని 125 కోట్ల మందికి లభించిన స్వాగతం
  • మోదీ మన దేశం పేరు ప్రపంచంలో పైకి తీసుకెళ్లారు
  • ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు తిరంగా యాత్ర తెలంగాణలో బీజేపీ నిర్వహించింది
  • 2019లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది
  • ఒవైసీ అంటే భయపడని ప్రభుత్వం కావాలంటే.. మోదీ చేతులు బలోపేతం చేయండి
  • భారత్ మాతాకీ జై.. వందేమాతరం...

Advertisement
Advertisement