Sakshi News home page

ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు

Published Thu, Nov 24 2016 2:36 AM

Clear RTC elections

మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా నిర్వహించిన ఆర్టీసీ క్రెడిట్ కో- ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ను నిర్వహించారు. ఐదేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికలను టీఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ ఎన్‌ఎంయూ, బహుజన కార్మిక యూనియన్‌లు బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిర్యాలగూడ డిపో నుంచి టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్‌లు బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. డిపోలో 445 మంది ఓటర్లకు గాను పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 434 ఓట్లు పోలయ్యాయి. కాగా ఆరు గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ను 9 రౌండ్లు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా డిపో మేనేజర్ సుధాకర్‌రావు వ్యవహరించారు. 
 
 టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ గెలుపు  
 ఎన్నికల్లో టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 9 రౌండ్లు కౌంటింగ్ నిర్వహించగా ప్రతి రౌండ్‌లో టీఎంయూకు అధికంగా ఓట్లు రాగా, చివరి రెండు రౌండ్లలో ఎంప్లాయీస్ యూనియన్‌కు సానుకూలంగా ఓట్లు వచ్చాయి. అయితే 9వ రౌండ్‌లో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. టీఎంయూ బలపరిచిన జి. గోపయ్యగౌడ్‌కు 222, మండారి వెంకటేశ్వర్లుకు 200, ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థి కేవీ రెడ్డికి 207, ఎన్‌ఎంయూ నుంచి చంద్రశేఖర్‌కు 128, ఎస్‌డబ్ల్యూఎఫ్ నుంచి జాకబ్‌కు 24, రాములుకు 21 ఓట్లు వచ్చాయి. టీఎంయూ బలపరిచిన అభ్యర్థి జి.గోపయ్య, ఎంప్లాయీస్ యూ నియన్ నుంచి కేవీ రెడ్డి గెలుపొం దారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయా యూనియన్ల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.    
 
 నార్కట్‌పల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు 
 నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి ఆర్టీసీలో జరిగిన టీసీఎస్ ఎన్నికల్లో టీఎంయూ అభ్యర్థి ఐతరాజు వెంకన్నపై ఇండిపెండెంట్ అభ్యర్థి (టీఎంయూ) టీహెచ్‌ఎం. చారి 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డిపోలో 274 ఓట్లు ఉండగా 271 పోలయ్యాయి. అందులో ఇండిపెండెంట్ అభ్యర్థి టీహెచ్‌ఎం. చారికి 165 ఓట్లు, టీఎంయూ అభ్యర్థి ఐతరాజు వెంకన్నకు 80 ఓట్లు, మిత్రపక్షాల అభ్యర్థి పాపయ్యకు 26 ఓట్లు లభించాయి. మూడు ఓట్లు చెల్లలేదు.   
 

Advertisement

What’s your opinion

Advertisement