ముగిసిన జాతీయస్థాయి ఫెస్ట్‌ విగ్నైట్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతీయస్థాయి ఫెస్ట్‌ విగ్నైట్‌

Published Sat, Sep 10 2016 10:57 PM

ముగిసిన జాతీయస్థాయి ఫెస్ట్‌ విగ్నైట్‌ - Sakshi

 
తనికెళ్ల (కొణిజర్ల) :తనికెళ్ల గ్రామ సమీపంలోని విజయ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్‌ ఫెస్ట్‌ విగ్నైట్‌ శనివారం ముగిసింది. మొదటి రోజు టెక్నికల్‌ అంశాలలో నిర్వహించిన పోటీలో పలు ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు రెండో రోజు కల్చరల్‌ ఈవెంట్‌లతో అదరగొట్టారు. ఆటలు, పాటలు, డా¯Œ్సలలో రోజంతా కళాశాల మొత్తం హోరెత్తింది.విద్యార్థులు ఫ్యాష¯ŒS,సంప్రదాయ దుస్తులతో నిర్వహించిన ర్యాంప్‌ వాక్‌ ఆకట్టుకుంది. పలు కళాశాలల విద్యార్థులు పలు రకాల సినీ, జానపద పాటలకు చేసిన నత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో  జబర్దస్త్‌ టీమ్‌ సభ్యుల ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ జానపద గాయకుడు సూపర్‌ సింగర్స్‌ ఫేమ్, కొణిజర్లకు చెందిన కె.జాన్‌ జానపద గీతాలు ఆలపించారు. 
  • విజేతలకు బహుమతులు అందజేత..
రెండు రోజుల పాటు వివిధ అంశాలలో నిర్వహించిన టెక్నికల్, కల్చరల్‌ అంశాలలో విజేతలైన వారికి కళాశాల యాజమాన్యం బహుమతులను అందజేశారు. జబర్దస్త్‌ టీమ్‌ సభ్యులను కవిత ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు వై.రవీందర్, సెక్రటరీ పి. ఉషాకిరణ్‌కుమార్, కరస్పాడెంట్‌ నెల్లూరి బుచ్చిరామారావులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీఏ అబ్దుల్‌ సలీమ్, వైస్‌ ప్రిన్సిపాల్‌ వి.చిన్నయ్య, ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ ఫెస్ట్‌ కన్వీనర్‌ ఆయేషా తరుణమ్, కో కన్వీనర్‌ వీరయ్య చౌదరి, ఏఓ మిట్టపల్లి అప్పారావు, కపిల్‌దేవ్, వివిధ డిపార్ట్‌మెంట్‌ల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement