అవినీతి అంతంతోనే నవ సమాజం | Sakshi
Sakshi News home page

అవినీతి అంతంతోనే నవ సమాజం

Published Mon, Oct 3 2016 1:36 AM

coraptin colapsed a new socity

  • ఆహింసతోనే తెలంగాణ సాధించాం
  • కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌  
  • ఖిలావరంగల్‌ : దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని, దాన్ని అంతం చేసినప్పుడే విలువల తో కూడిన నవ  సమాజం సాధ్యమవుతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తి, ఆహింస మార్గంతోనే తెలంగా ణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.
    వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులోని ఆనంద ఆశ్రమ చారిటబుల్‌ ట్రస్ట్‌ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన శ్రీధర్‌ మాట్లాడుతూ.. అహింసా మార్గంలోనే మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని అన్నారు. అయితే ఆయన కలలు గన్నట్టుగా కాకుండా నేడు దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.  దేశంలో ఆవినీతి ఉన్నంత వరకు ఉగ్రవాదం బలపడుతూనే ఉంటుందని హెచ్చరించారు. అనంతరం  వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆశ్రమ చైర్మ¯న్‌ , రిటైర్డ్‌ ఫ్రొఫెసర్‌ ఎస్‌. పర్మాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటి  రిటైర్డ్‌ ఫ్రొఫెసర్‌ గోపాల్‌రావు, ఆకారపు హరీశ్,  కరీంనగర్‌ డైట్‌ కళాశాల   ప్రిన్సిపాల్‌ వేదాంతం లలితాదేవి తదితరులు పాల్గొన్నారు. 
     
    మా నాన్న ఇక్కడే 
    లైబ్రేరియన్‌ గా పనిచేశారు   
    హన్మకొండ చౌరస్తా :‘మా నాన్న ఎంఎస్‌ ఆచారి రాజరాజనరేంద్ర భాషా నిలయం లో గల గ్రంథాలయంలో లైబ్రేరియన్‌  గా పనిచేశార’ని మాడభూషి శ్రీధర్‌ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. హన్మకొం డలోని రాజరాజనరేంద్ర భాషా నిలయం లో ఆదివారం లోక్‌సత్తా ఆధ్వర్యంలో ‘ఏకకాలంలో చట్టసభల ఎన్నికలు– సంస్కరణలు’ అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆ యన మాట్లాడారు.  సుదీర్థ కాలం తర్వా త తన తండ్రి పనిచేసిన చోటుకు రావడం ఆనందంగా ఉందన్నారు. చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ మంచి పరిణామమేనని, అయితే ఎన్నికల్లో డబ్బు ప్రాత నానాటికీ పెరగడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.   

Advertisement
Advertisement