‘చౌట్‌పల్లి’ ఎత్తిపోతల ట్రయల్‌రన్‌ | Sakshi
Sakshi News home page

‘చౌట్‌పల్లి’ ఎత్తిపోతల ట్రయల్‌రన్‌

Published Mon, Aug 15 2016 10:45 PM

‘చౌట్‌పల్లి’ ఎత్తిపోతల ట్రయల్‌రన్‌ - Sakshi

మోర్తాడ్‌ : మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల్లోని రైతాంగానికి సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం ట్రయల్‌రన్‌ను సోమవారం నిర్వహించారు. రెండేళ్ల పాటు లక్ష్మి కాలువకు నీరు రాకపోవడంతో ఎత్తిపోతల పథకం పని చేయలేదు. లక్ష్మి కాలువకు ఇటీవల నీటిని విడుదల చేశారు. దీంతో ఎత్తిపోతల పథకం ట్రయల్‌రన్‌ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. శెట్‌పల్లి శివారులో ఉన్న ప్రధాన పంప్‌హౌస్‌లోని ఆరు మోటార్లకు మరమ్మతులు చేయించి, తిమ్మాపూర్, కమ్మర్‌పల్లిల పైప్‌లైన్‌లకు సోమవారం నీటిని విడుదల చేశారు. మిగిలిన పైప్‌లైన్‌లకు కూడా రెండు మూడు రోజుల్లో ట్రయల్‌రన్‌ నిర్వహిస్తామని ఎత్తిపోతల పథకం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆత్మారామ్‌ తెలిపారు. సోమవారం రోజున నిర్వహించిన ట్రయల్‌రన్‌లో 20 నిమిషాల పాటు పంపుసెట్లు పని చేశాయన్నారు. 
 

Advertisement
Advertisement