నష్ట పరిహారం ఇవ్వాల్సిందే | Sakshi
Sakshi News home page

నష్ట పరిహారం ఇవ్వాల్సిందే

Published Sat, Dec 10 2016 11:28 PM

నష్ట పరిహారం ఇవ్వాల్సిందే - Sakshi

  • దివీస్‌కు వ్యతిరేకంగా బాధిత గ్రామాల ప్రజల వంటావార్పు
  • సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
  • రైతుల భూముల్లో చెట్లు తొలగించడంపై నిరసన 
  • నేతలతోపాటు బాధితుల అరెస్టు
  • తొండంగి:
    దివీస్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో చెట్ల తొలగింపునకు నిరసనగా ఆయా భూముల యజమానులు, రైతులు శనివారం వంటావార్పు చేపట్టారు. కోనప్రాంతంలో తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలోని కొత్తపాకలు గ్రామం సమీపంలో దివీస్‌ ల్యాబోరేటరీస్‌కు ప్రభుత్వం సుమారు 670 ఎకరాలకు కేటాయించడం, ఈ వ్యవహారాన్ని బాధిత గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రెవెన్యూ అధికారులు దివీస్‌కు ప్రతిపాదించిన భూముల్లోని చెట్లును తొలగించడంపై బాధిత గ్రామాల ప్రజలు వంటావార్పు నిర్వహించారు. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల ప్రజలు దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వంటలు చేశారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. కోన భూముల్లో జీడిమామిడి, సరుగుడు, ఇతర తోటల ఫలసాయమే జీవనాధారంగా జీవిస్తున్న తమ భూములను వదిలి వెళ్లేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు రైతులు విక్రయించని భూముల్లో చెట్లను తొలగింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేని, కాలుష్యకారకమైన దివీస్‌ పరిశ్రమ కోసం ప్రభుత్వం తమపై పోలీసులను ప్రయోగిస్తూ అన్యాయంగా భూములను లాక్కోవడం దారుణమన్నారు. 144 సెక్ష¯ŒS అమలుచేసి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో నాలుగు నెలలుగా తమను భయపెడుతున్నారన్నారు. తమ పోరాటం పోలీసులపై కాదని, బలవంతపు భూసేకరణపైనేనని దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, బాధిత ప్రజలు స్పష్టం చేశా రు.రైతులు విక్రయించని భూ ముల్లో చెట్ల తొలగింపు వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వా లని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీఐటీయూ నాయకుడు వేణుగోపాల్, దివీస్‌ వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. బాధిత రైతులతో కలిసి నరికేసిన చెట్లును పరిశీలించారు. ఇంతలో అక్కడకు వందలాదిగా పోలీసులు వ్యాన్లలో వచ్చా రు. స్టేటస్కో ఉన్న భూముల్లో చెట్లు నరకడం దారుణమని శేషుబాబ్జి అన్నారు. బాధితరైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ అక్కడే బైఠాయించారు. డీఎస్పీ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులంతా వారిని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. తాము పెంచిన చెట్లను చూసుకుంటూ ఏడుస్తున్న మహిళలను సైతం పోలీసులు లాక్కెళ్లి అరెస్టు చేశారు. కాలుష్య కారక దివీస్‌కు వత్తాసుపలుకుతూ పోలీసులు తమపై దౌర్జన్యంగా అరెస్టు చేయడం అన్యాయమని, పోలీస్‌ జులుం నశిం చాలంటూ నినాదాలు చేశారు. ఈకార్యక్రమానికి మద్దతుపలికిన సీపీఐ.(ఎం.ఎల్‌.) న్యూడెమోక్రసీ, లిబరేషన్, జనశక్తి పార్టీల నేతలను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు సీపీఐ(ఎం.ఎల్‌) లిబరేష¯ŒS పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు బుగతా బంగార్రాజు, సీపీఐ(ఎం.ఎల్‌) జనశక్తి నాయకుడు కర్నాకుల వీరాంజనేయులు తెలిపారు. అరెస్టయిన వారిలో దివీస్‌ వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్‌కుమార్, మత్స్యకారనాయకుడు మేరుగు ఆనందహరి, మోసా సత్యనారాయణ, గంపల దండు, యనమల శ్రీనివాసరావు, బద్ది శ్రీను,అంబుజాలపు నాగకృష్ణవేణి, నేమాల నాగేశ్వరరావు, కుక్కా బొగ్గురాజు, అం బుజాలపు అప్పారావు, కుమ్మరి సూర్యారావు,  కంబాల జగన్నా«థం తదితరులు ఉన్నారు.
     
    ఎంతో కష్టపడి చెట్లును పెంచాను 
    మాది తాటియాకులపాలెం గ్రామం. 1.30 ఎకరాల భూమి ఉంది. ఎంతో కష్టపడి జీడిమామిడి చెట్లను పెంచాను. జీడిపిక్కల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాటిని అన్యాయంగా నిరికేశారు.                             
      –కె.సత్తిబాబు, రైతు, తాటియాకులపాలెం
     

Advertisement
Advertisement