సమన్వయంతో సత్ఫలితాలు సాధిద్దాం | Sakshi
Sakshi News home page

సమన్వయంతో సత్ఫలితాలు సాధిద్దాం

Published Mon, Aug 1 2016 10:44 PM

సమన్వయంతో సత్ఫలితాలు సాధిద్దాం - Sakshi

కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
జిల్లా అధికారులతో సమీక్ష
కాకినాడ సిటీ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌ సూచించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఆర్‌డీఏ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, అటవీశాఖ, పశుసంవర్ధకశాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు పూర్తిచేయడానికి రూ.ఆరు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు.   రోడ్‌ కనెక్టివిటీ ప్రోగ్రాం కింద చేపట్టిన పనుల వివరాలు సమర్పించాలని పీడీ డ్వామాను ఆదేశించారు.
  జిల్లాలోని చిన్నతరహా నీటిపారుదల చెరువుల్లో చేపపిల్లలు పెంచేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా కాప్టివ్‌ నర్సరీల పథకాన్ని అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఈ విధంగా మెట్ట ప్రాంతాల్లో పది యూనిట్లు నెలకొల్పుతామన్నారు. ఒక్కొక్కటి రూ.11 లక్షల వ్యయం కాగల ఈ యూనిట్లను ఉపాధి హామీ, మత్స్యశాఖలు అమలు చేస్తాయన్నారు. 
గ్రామాల్లో పారిశుద్ధ్య వారోత్సవం
గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య వారోత్సవాలు చేపట్టాలని, డీపీఓను కలెక్టర్‌ ఆదేశించారు.  సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి, సీపీఓ మోహనరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజేశ్వరరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కె.చంద్రయ్య, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.జ్యోతి, ఐసీడీఎస్‌ పీడీ ప్రవీణ, జేడీఏ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement