వైఎస్సార్‌ సీపీలోకి మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి

Published Tue, Dec 13 2016 11:18 PM

వైఎస్సార్‌ సీపీలోకి మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి - Sakshi

సాక్షి, విజయవాడ : బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే  వెలంపల్లి శ్రీనివాస్‌ మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలోSచేరారు. హైదరాబాద్‌లో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి శ్రీనివాస్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు.
ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా....
విజయవాడ వన్‌టౌన్‌లో ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలు పొందారు. 2014 ఎన్నికల్లో బీజేపీలో చేరిన ఆయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పరాజయం పొందినా పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన దూరంగా కాలేదు.
  టీడీపీ అధికారంలోకి రావడం, మిత్రపక్షంగా బీజేపీ ఉండడంతో..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు తన వంతు కృషి చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాను కూల స్పందన రాకపోవడం, బీజేపీ అగ్రనేతలు పట్టించు కోకపోవడంతో బీజేపీని వీడి ప్రతిపక్షంలో చేరి రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు.
దేవాలయాల కూల్చివేతను అడ్డుకుని....
పుష్కరాల సమయంలో  రాష్ట్ర ప్రభుత్వం 40 దేవాలయాలను కూల్చివేసింది. దీనికి నిరసనగా వెలంపల్లి బీజే పీ, హిందూ ధర్మ పరిరక్షణ నేతలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇంకా పలు దేవాలయాలను కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. కూల్చివేసిన దేవాలయాలను తిరిగి నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడాన్ని  వెలంపల్లి బహిరంగంగానే విమర్శించారు.
వెలంపల్లి హయాంలో.....
ఎమ్మెల్యేగా వెలంపల్లి ఎన్నికయ్యే సమయానికి వన్‌టౌన్‌ అంతా గోతులు మయంగా ఉండేది. ఆయన హయాంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్ని 80 శాతం పూర్తి చేయించారు. పలు రోడ్లు వేయించారు. భవానీపురంలో రైతు బజార్, పోలీసుస్టేషన్‌ రావడం వెనుక ఆయన కృషి ఉంది. అప్పటి కేంద్రమంత్రి చిరంజీవితో మాట్లాడి గాంధీహిల్‌కు రూ.5 కోట్ల నిధులు ఇప్పించారు. బైపాస్‌ నాలుగు లైన్ల రహదారి, స్వాతి థియేటర్‌ రోడ్డు నాలుగు లైన్ల రహదారిగా, సితార వద్ద నాలుగు లైన్ల రహదారిగా ఆయన హయాంలోనే అభివృద్ధి జరిగాయి.
పలు పనులను పూర్తి చేయని ప్రభుత్వం
ఇంకా ఆయన హయాంలో ప్రారంభించిన పలు పనులు ఇప్పటికీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. రూ.21 కోట్లతో నైజాంగేటు వద్ద డ్రైనేజీని అభివృద్ధి చేసి బుడమేరులో కలిపేందుకు జీవో తెచ్చినా కార్యరూపం దాల్చలేదు. భవానీపురం కార్మిక శాఖకు చెందిన 11 ఎకరాలను స్టేడియంగా మార్చేందుకు పరిపాలనా అనుమతులు వచ్చినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. షేక్‌ రాజా హస్పటల్‌ను మినీ హాస్పటల్‌గా మార్చేందుకు జీవో తెచ్చినా కార్యరూపం దాల్చలేదు.
వెలంపల్లితో పాటు పలువురు .....
వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వివిధ పార్టీల నాయకులు చేరారు. వారిలో మైలవర పు దుర్గారావు, అప్పలూరి పెదబాబు, రాయన నరేంద్ర, నాహిల్, బలసాని కిరణ్, కొనకళ్ల విద్యాధరరావు, వక్కలగడ్డ శ్రీకాంత్, వెన్నం రజని, కనిశెట్టి లక్ష్మణరావు, మధిర ప్రభాకర్, బెరింగుల రమణ, మద్ది శ్రీనివాసు, తమ్మిన పవన్‌కుమార్, ఏలూరు వెంకన్న, పదిలం రాజశేఖర్, ఇమామ్‌ ఖాన్, గుంట్ల రామ్మోహన్‌రావు, పిళ్లా దుర్గారావు, ఫణుగు ఫణి, మునిశెట్టి లోకేష్, పరుచూరి నాగేశ్వరరావు, తమ్మిన శ్రీనివాస్, వాజిత్‌ ఖాన్, కాశిరెడ్డి, బొండా నారాయణరావు, మురళీనాయక్, పాల్వయి దాసు, గుర్రం సుబ్బయ్య, నంబూరి వంశీధర్, పల్లపోతు మురళీకృష్ణ, బుద్దా రాంబాబు, వాకా బాబు తదితరులు చేరారు.
 

Advertisement
Advertisement