ఎన్నికల హామీలు విస్మరించిన టీఆర్‌ఎస్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలు విస్మరించిన టీఆర్‌ఎస్‌

Published Sat, Sep 3 2016 6:53 PM

వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న గుంటుక సంపత్, స్థానిక మహిళలు - Sakshi

  • వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్‌
  • సిరిసిల్లలో వైఎస్సార్‌ సీపీలో చేరికలు 
  • సిరిసిల్ల : ఎన్నికల హామీలు టీఆర్‌ఎస్‌ విస్మరించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్‌ విమర్శించారు. సిరిసిల్లలో శనివారం గుంటుక సంపత్‌ ఆధ్వర్యంలో 50 మంది వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. అట్టహాసంగా ప్రకటించి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంలో ఒక్క ఇంటిని కూడా పేదవాడికి నిర్మించి ఇవ్వలేదన్నారు. అర్హులకు పింఛన్లు రావడం లేదని, దళితులకు మూడెరాలు కలగానే మిగిలిందన్నారు. కేజీ టు పీజీ విద్యను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మహిళలకు పావలా వడ్డీ రావడం లేదని, రైతుల రుణమాఫీ నిలిచిపోయిందన్నారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల యాదగిరి, సిరిసిల్ల మండల అధ్యక్షుడు చొక్కాల రాము, పార్టీ నాయకులు దేవరనేని వేణుమాధవరావు, వంగరి అనిల్, కొంపెల్లి విష్ణు, బూర నాగరాజు, వరాల శ్రీనివాస్, చింతల అశోక్, కొత్వాల్‌ రవి, స్వర్గం బాలమణి, సాన రాజయ్య, ఉషకోళ్ల లక్ష్మి పాల్గొన్నారు. 
    సిరిసిల్ల జిల్లా కోసం ఆర్డీవోకు వినతి 
    సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టణంలో ర్యాలీ తీశారు. అనంతరం ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం అందించారు. సిరిసిల్లను జిల్లా చేయాలని కోరారు.  

Advertisement
Advertisement