ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు | Sakshi
Sakshi News home page

ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు

Published Fri, Nov 18 2016 2:28 AM

ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు

తప్పనున్న పొగ తిప్పలు
  డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు బంద్
  స్టౌల సరఫరాకు రూ.30.60 లక్షలు
  450 స్టౌలు సరఫరా.. ఒక్కో దానికి రూ.6,800  
 

ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఇక పొగ కష్టాలు దూరం కానున్నారుు. నాలుగు జిల్లాల్లో కట్టెల పొరుు్యపై వంట తిప్పలు తప్పనున్నారుు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గ్యాస్ స్టౌలపై వంటలు వండాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకోవడంతోపాటు జూన్‌లో గ్యాస్ స్టౌల సరఫరాకు టెండర్లు నిర్వహించింది. దీంతో ప్రస్తుతం ఆయూ హాస్టళ్లకు గ్యాస్ స్టౌలు సరఫరా అవుతున్నారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కట్టెల బిల్లులు నిలిపి వేస్తున్నట్లు ఐటీడీఏ ప్రకటించింది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 123 ఆశ్రమ పాఠశాలలు, ఏడు వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో దాదాపు 40 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

వీరికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలను ఐటీడీఏ కల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భోజనాల కోసం ఏళ్ల తరబడిగా కట్టెల పొరుు్యలు ఉపయోగిస్తున్నారు. దీంతో సకాలంలో వంటలు కాకపోవడం, కట్టెల కొరతతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1995 నుంచి 2004 మధ్యకాలంలో 96 ఆశ్రమ పాఠశాలలకు దాదాపు రూ.38,81,654 వెచ్చించి గ్యాస్ స్టౌల సౌకర్యం కల్పించారు. వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం 2004-08 మధ్య కాలంలో రూ.3,33,300 కేటారుుంచారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆశ్రమ పాఠశాలలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. గ్యాస్ స్టౌలను వినియోగించడంలో సిబ్బంది విఫలమవడం, మరమ్మతులు లేక మూలనపడడం జరిగింది. తాజాగా ఐటీడీఏ మళ్లీ గ్యాస్ స్టౌలపై వంటలకు శ్రీకారం చుట్టింది. దీంతో ఒక్కో స్టౌకు రూ.6,800 వెచ్చించి 450 గ్యాస్ స్టౌల సరఫరాకు జూన్‌లో రూ.30.60 లక్షలకు టెండర్లు నిర్వహించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు స్టౌల సరఫరాకు చర్యలు చేపట్టింది.

కట్టెల పేర అక్రమాలకు చెక్
ఆశ్రమ పాఠశాలల్లో వంటల కోసం కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. నిత్యం వార్డెన్లు ఎడ్లబండ్ల సహా యంతో సమీప అటవీ ప్రాంతాల నుంచి కట్టెలు తెప్పిస్తున్నారు. దూరభారాన్ని బట్టి ఒక్కో ఎడ్లబండికి రూ.800 నుంచి రూ.1,200 వరకు చెల్లిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది సిబ్బంది ఒక నెలలో వంట కోసం తెప్పించిన ఎడ్లబండ్ల కంటే రెండింతలు ఎక్కువగా రాస్తూ నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నారుు. పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినా ఫలితం ఉండేది కాదు. ఎట్టకేలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేస్తుండడంతో కట్టెల పేరిట జరిగే అక్రమాలకు చెక్ పడనుంది.   

సిలిండర్ల సంఖ్య పెంచితెనే ఫలితం
గతంలో ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్ స్టౌలపై వంటలు చేయడం అమలు కావడంతో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో ఆశ్రమ పాఠశాలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. కొన్నాళ్లకే గ్యాస్ స్టౌలు నిర్వహణ లేక మూలనపడ్డారుు. గ్యాస్ సిలిండర్లు పక్కాదారి పట్టాయి. ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే కొందరు తమ సొంత అవసరాలకు ఇళ్లకు తీసుకెళ్లారు. వాటి విషయమై ఆరా తీసే వారు లేకపోవడంతో అప్పట్లో అందించిన సిలిండర్లు.. ఇప్పుడున్న సిలిండర్లకు లెక్క కుదరడం లేదు. మిగిలిన నాలుగైదు సిలిండర్లు మినహా మిగితా వాటి జాడలేదు.

ఐటీడీఏ అధికారులు పూర్తి స్థారుులో విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ప్రస్తుతం ఆశ్రమాల్లో విద్యార్థుల సంఖ్య మూ డింతలు పెరిగింది. నాలుగు సిలిండర్లు ఉన్న ఆశ్రమా ల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అదీగాక నాలుగు జిల్లాల్లోని ఆశ్రమాలు మారుమూల ప్రాంతా ల్లో ఉన్నారుు. సకాలంలో సిలిండర్లు సరఫరా కాకుంటే విద్యార్థులు పస్తులుండాల్సి వస్తుంది. సిలిండర్ల సంఖ్య పెంచాలని నిర్వాహకులు కోరుతున్నారు.
 
మంచి నిర్ణయం
1989 నుంచి ఆశ్రమ పాఠశాలల్లో కుక్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇన్నాళ్లకు ఆశ్రమాల్లో గ్యాస్ పొరుు్యలు ఏర్పాటు చేయడం సంతోషం. కట్టెల పొరుు్యలపై వంట చేస్తుండడంతో నిత్యం పొగ చూరి కుక్‌లకు కంటి వ్యాధులు వస్తున్నారుు. ఇప్పటికే చాలామంది కంటి సమస్యలతో ఉద్యోగాలు మానుకున్నారు. - అక్బర్, కుక్, బాలుర ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్

డిసెంబర్ నుంచి గ్యాస్‌పై వంటలు
నాలుగు జిల్లాల్లోని ఆశ్రమ, వసతి గృహాలకు గ్యాస్ పొరుు్యలు సరఫరా చేస్తున్నాం. డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు చెల్లించెది లేదని స్పష్టం చేశాం. గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి రావడంతో పలు ఆశ్రమాల్లో కట్టెల పేరుతో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే చాలా ఆశ్రమాలకు పొరుు్యలు చేరారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ పొరుు్యల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.- రాంమూర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు

Advertisement
Advertisement