7 నుంచి తిరుపతిలో ‘ఇండస్ట్రియల్‌’ ఎక్స్‌ఫో | Sakshi
Sakshi News home page

7 నుంచి తిరుపతిలో ‘ఇండస్ట్రియల్‌’ ఎక్స్‌ఫో

Published Sat, Jul 1 2017 11:20 PM

'Industrial' Expo from Tirupati

అనంతపురం టౌన్‌ :  పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7,8,9 తేదీల్లో తిరుపతిలో నేషనల్‌ ఇండస్ట్రియల్‌ మెషనరీ ఎక్స్‌ఫో నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌బాబు ఓప్రకటనలో తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్, యునైటెడ్‌ క్రియేషన్స్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు హాజరై ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలియజేస్తారన్నారు. వివరాలకు సెల్‌ : 9393714787, 9393714788, 9393714789లో సంప్రదించాలన్నారు. 

Advertisement
Advertisement