మడితాడుకు చేరిన ఝరికోన ప్రాజెక్టు నీరు | Sakshi
Sakshi News home page

మడితాడుకు చేరిన ఝరికోన ప్రాజెక్టు నీరు

Published Wed, Oct 19 2016 11:55 PM

juricona water in madithadu village

సుండుపల్లి:  గత మాసం 28వ తేదీన బహుదానదిలో ఝరికోనప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు. అయితే ప్రాజెకు ్టతూము గేటు తీసే సమయంలో కడ్డీ విరిగిపోవడంతో తూములోనుంచి తక్కువ మోతాదులో నీరు వచ్చేది.  నీటిపారుదలశాఖ అధికారులు మంగళవారం చెన్నై నుంచి నిపుణులను పిలిపించి తూము గేట్లును మరమ్మతులు చేయించారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో తూములు పూర్తిగా ఎత్తివేయడంతో బహుదా నదిలో ఝరికోననీరు పరవళ్లు తొక్కింది. బుధవారం సాయంకాలానికి మడితాడుకు చేరుకున్నాయి.  సుండుపల్లి నుంచి ఎగువపల్లికి వెళ్లాలంటే బహుదానదిలో వెళ్లాలి. బహుదానదిలో నీరు వస్తుండటంతో ద్విచక్రవాహనదారులు ఎగువపల్లికి వెళ్లాలంటే నదికి అటు, ఇటువైపులా వాహనాలు పెట్టి మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. అయితేమాత్రం ఒక యువకుడు సాహసంచేయరా డింభకా అనేస్థితిలో వాహనం పూర్తిగా మునిగిపోతున్నా చివరికి ఇటువైపు నుంచి అటువైపు ఒడ్డుకు చేరుకున్నాడు.

Advertisement
Advertisement