ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ...

22 Jul, 2016 01:26 IST|Sakshi
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ...

బొబ్బిలి రూరల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్రరాజు, బంధువులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఎం.బూర్జవలస పంచాయతీ పరిధిలోని గున్నతోటవలస గ్రామానికి చెందిన కోండ్రు అనూరాధ(25), ఈశ్వరరావు నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి  రెండున్నరేళ్ల బాబు రుషి ఉన్నాడు. ఈశ్వరరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
 
అయితే ఏడాదిన్నరగా ఈశ్వరరావు అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనూరాధ గురువారం మధ్యాహ్నం నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తనను భర్త వేధిస్తున్నాడని కేరళలో ఉన్న తల్లి చంద్రావతి, సవతి తండ్రి షాకోచన్‌లకు ఇటీవలే అనరాధ తెలియజేయడంతో వారు రెండురోజుల కిందటే వచ్చారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సౌమ్యలత, తహసీల్దార్ ప్రసాద్‌పాత్రో మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా చేశారు. ఎస్సై రవీంద్రరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా